TTDP : ఏ పార్టీ ప్రతిపాదనలు చేయలేదు – ఎల్.రమణ

TTDP : ఏ పార్టీ ప్రతిపాదనలు చేయలేదు – ఎల్.రమణ

Ttdp ramana

TTDP President L Ramana : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీ మారుతారా ? సైకిల్ దిగి..కారెక్కుతారా ? జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఏ పార్టీ తన ముందు ప్రతిపాదనలు పెట్టలేదని, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను గమనించడం జరుగుతోందన్నారు ఎల్ రమణ. దీనిపై తన సన్నిహతులు, ఇతరులతో చర్చించడం జరిగిందని, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పార్టీ మార్పుపై 2021, జూన్ 14వ తేదీ సోమవారం ఉదయం జగిత్యాలలో ఎల్.రమణ మీడియాతో మాట్లాడారు.

తాను ఓ శుభకార్యం నిమిత్తం జగిత్యాలకు రావడం జరిగిందన్నారు. ఊహించని రీతిలో రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయని, ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఎన్టీరామారావు పార్టీ పెట్టిన సందర్భంలో…యువకుడిగా ఉన్నప్పుడు టీడీపీలో చేరినట్లు చెప్పారు. ప్రజాగర్జన పెట్టిన సమయంలో…చాలా మంది పాల్గొన్నారని తెలిపారు. రాజకీయాల్లో ఒక నూతన ఒరవడి ఎన్టీఆర్ సృష్టించారని, రాజకీయాలు చిన్నతరం నుంచే ప్రారంభించానన్నారు. సామాన్య, సాధారణమైన కుటుంబంలో జన్మించానన్నారు. పది సార్లు బీఫాంపై పోటీ చేసినట్లు, నాటి నుంచి నేటి వరకు తాను పనిచేయడం జరిగిందన్నారు.

జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన వంటి కార్యక్రమాలతో ప్రజల ముందుకు రావడం జరిగిందన్నారు. టీడీపీ పార్టీ ఇచ్చిన ప్రతి పనిని నెరవేర్చడం జరిగిందని, ఊహించని రీతిలో ఇబ్బందులు పడడం జరిగిందన్నారు. అధికారంలో లేకున్నా..ముందుకెళ్లామని, అనేక ఎన్నికల్లో అటుపొట్లను ఎదుర్కొన్నామన్నారు. 2014 తర్వాత..రైతుల ఆత్మహత్యలు పాల్పడుతుంటే..టీడీపీ శ్రేణులను కదిలించి..600 కుటుంబాలను కలవడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని మెప్పించి..రైతు బీమా కల్పించే విధంగా కృషి చేశామన్నారు.

ప్రజా జీవితంలో మరింత ముందుకెళ్లాలని, మంచి నిర్ణయంతో ముందుకు రావాలని తన సహచరులు చెప్పారన్నారు. పార్టీ మారుతున్నట్లు తాను ఎక్కడా చెప్పలేదన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఎలాంటి ప్రతిపాదనలు పెట్టలేదని, కానీ తాను ప్రతిపాదనల కోసం పని చేయనని, ప్రజల కోసం పని చేస్తానన్నారు. పదవుల కోసం తాను పాకులాడే వ్యక్తిని తాను కాదని, ఓటర్ మనోభావాల అనుగుణంగా పని చేస్తానన్నారు. తనవల్ల ఇబ్బందులు కలిగితే..క్షమించాలని, ఎవరు ఏ బాధ్యత ఇస్తే..అది చేయడమే తన బాధ్యత అన్నారు ఎల్.రమణ.

Read More : Amravati: ఢిల్లీ టూర్ తరువాత..గవర్నర్ తో భేటీ కానున్న సీఎం జగన్