పోలీస్ స్టేషన్‌లో దీపిక దంపతులు.. కిడ్నాప్ కాదు.. విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు

  • Published By: vamsi ,Published On : September 29, 2020 / 06:32 PM IST
పోలీస్ స్టేషన్‌లో దీపిక దంపతులు.. కిడ్నాప్ కాదు.. విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు

Twist in Kidnap Deepika Case: ప్రేమ వివాహం చేసుకున్న యువతి దీపిక కిడ్నాప్ కేసు వికారాబాద్‌లో కలకలం రేపగా.. నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్న దీపిక షాపింగ్‌కి వెళ్లి వస్తూ ఉండగా.. కిడ్నాప్‌కి గురైనట్లుగా చెప్పిన దీపిక కేసులో ఊహించని ట్విస్ట్ బయటకు వచ్చింది. గత మూడు రోజులగా ఆమె కోసం ఆరు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టిన పోలీసులకు యువతి షాకిచ్చింది. తాను ఇష్టపూరితంగానే భర్త అఖిల్‌తో కలిసి వెళ్లినట్టు పోలీసులకు స్పష్టం చేసింది.

వికారాబాద్‌ పోలీసు స్టేషన్‌కు దీపిక, ఆమె భర్త అఖిల్ వికారాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వచ్చారు. వికారాబాద్‌కు చెందిన దీపిక, అఖిల్‌ 2016లో ఆర్యసమాజ్‌లో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం రెండు సంవత్సరాల క్రితం అమ్మాయిని తీసుకుని వచ్చారు. కుటుంబ సభ్యుల బలవంతం మేరకు అఖిల్‌ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.



ఈ క్రమంలోనే వికారాబాద్ కోర్టుకు వీరిద్దరు హాజరవగా.. అదే రోజు సాయంత్రం దీపిక షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వస్తున్నప్పుడు ఓ కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆ యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని పోయారు. దీనిపై యువతి కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మూడు రోజుల క్రితం దిపికను ఆమె భర్త ముంబై తీసుకుని పోయినట్లుగా తెలుస్తుంది. దీపిక కేసులు ఎట్టకేలకు ఛేదించిన పోలీసులు.. అమ్మాయి, అబ్బాయి 2016లో పెళ్లి చేసుకున్నారని వెల్లడించారు.



విడాకులు ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో భర్తతో వెళ్లిపోయినట్లు అమ్మాయి చెప్పిందని పోలీసులు స్పష్టం చేశారు. భర్త అఖిల్‌తో వెళ్లినట్లు ఆమె చెప్పగా.. భార్యాభర్తలుగా మేం కలిసి ఉంటాం.. మాకు రక్షణ కల్పించండి అని కోరిందని పోలీసులు వెల్లడించారు. ఇష్టపూర్వకంగానే తన భర్త అఖిల్‌తో వెళ్లిపోయానంటూ ఆమె పోలీసులకి చెప్పింది.