Gandhi Hospital : గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో ట్విస్టు..మత్తు మందు ఇచ్చి రేప్?

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో ట్విస్టు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మెడికల్ రిపోర్టు కీలకంగా మారింది.

Gandhi Hospital : గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనలో ట్విస్టు..మత్తు మందు ఇచ్చి రేప్?

Gandhi Hospital

rape incident at Gandhi Hospital : హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో ట్విస్టు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మెడికల్ రిపోర్టు కీలకంగా మారింది. మత్తు ప్రయోగం జరగలేదన్నట్లు మెడికల్ రిపోర్టులో తెలుస్తోంది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది.

దీంతో ఫోరెన్సిక్ బృందం బాధితురాలి రక్తం నమూనాలను సేకరించింది. అయితే వీటి ఫలితాల్లో క్లోరో ఫామ్ సహా ఇతర ఆనవాళ్లేవి కనిపించలేదని పోలీసులకు రిపోర్టు అందినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమా మహేశ్వర్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు.

మహబూబ్ నగర్ కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు గాంధీ ఆస్పత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన ఘటన సంచలనం కలిగించింది. వీరిలో అక్క మాయం అయ్యింది. తల్లి సహాయంతో చెల్లెలు చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ అఘాయిత్యానికి పాల్పడింది ల్యాబ్ టెక్నీషియన్ ఉమా మహేశ్వర రావు, సెక్యూరిటీ గార్డుగా తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో ల్యాబ్ టెక్నీషిన్ ఉమా మహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేయగా, సెక్యూరిటీ గార్డు పరార్ అయ్యాడు. పరారీలో ఉన్న సెక్యూరిటీ గార్డు కోసం పోలీసులు గాలిస్తుస్తున్నారు.

తన బావ చికిత్స కోసం ఈ నెల 4వ తేదీన గాంధీ ఆస్పత్రిలో చేరగా అక్కడి సిబ్బంది తనపై అత్యాచారం చేశారంటూ ఒక మహిళ పోలీసులను ఆశ్రయించింది. తన అక్కను.. తనను గదిలో బంధించి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.

అయితే కిడ్నాపర్ల చెర నుంచి తాను తప్పించుకొని బయటపడ్డానని.. కానీ తన అక్క ఆచూకీ తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మహబూబ్ నగర్ జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లామని..కొందరి సహాయంతో హైదరాబాద్ చిలకల గూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వచ్చానని తెలిపింది.