Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో ఇద్దరు అరెస్ట్‌

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలి, ఏపీ మర్కంటైల్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్ మేనేజర్ పద్మావతిని పోలీసులు అరెస్టు చేశారు.

Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో ఇద్దరు అరెస్ట్‌

Telugu Academy (1)

Two arrested in funds fraud case : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలి, ఏపీ మర్కంటైల్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్ మేనేజర్ పద్మావతిని పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు అకాడమీ నిధులని ఇద్దరు కలిసి స్వాహా చేసినట్లుగా గుర్తించిన పోలీసులు.. వారిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఇద్దరు మేనేజర్లు డ్రా చేశారు. ప్రస్తుతం సిద్దంబర్ బజార్ బ్రాంచ్ మేనేజర్‌గా పద్మావతి పనిచేస్తుండగా.. కార్వాన్, సంతోష్ నగర్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌లకు మస్తాన్ వలీ పనిచేస్తున్నారు. మరో ముగ్గురు తెలుగు అకాడమీ అధికారుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది.

Telugu Academy : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌లో సంచలన విషయాలు

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 60 కోట్ల రూపాయలు గల్లంతైనట్టు దర్యాప్తు కమిటీ గుర్తించింది. యూనియన్‌ బ్యాంక్‌ కార్వాన్‌ శాఖ నుంచి 43 కోట్లు, సంతోష్‌ నగర్‌ బ్రాంచిలో 8 కోట్లు, చందానగర్‌ కెనరా బ్యాంకు శాఖ నుంచి 9 కోట్ల రూపాయలు గల్లంతయ్యాయని తేలింది. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారితో పాటు మరో అనుమానితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో తెలుగు అకాడమీ అధికారుల నిర్లక్ష్యాన్ని దర్యాప్తు కమిటీ గుర్తించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పది ప్రభుత్వరంగ బ్యాంకు బ్రాంచిల్లో 320 కోట్ల డిపాజిట్ చేసింది. చందానగర్‌ కెనరా బ్యాంకులోని 33 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఇటీవలే 20 కోట్లను అకాడమీ అధికారులు విత్‌ డ్రా చేసుకున్నారు. నిధుల గోల్‌మాల్‌పై త్రిసభ్య కమిటీ రేపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.