Tiger Attack : ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం.. ఆందోళనలో రైతులు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని బెజ్జూర్‌ మండలం పాపన్‌పేట గ్రామం సమీపంలో పులి సంచరిస్తోంది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

Tiger Attack : ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం.. ఆందోళనలో రైతులు

Tiger Attack

Tiger Attack : కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని బెజ్జూర్‌ మండలం పాపన్‌పేట గ్రామం సమీపంలో పులి సంచరిస్తోంది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల గ్రామానికి చెందిన తుమ్మిడే సురేశ్‌, బుజాడి అంజయ్యకు చెందిన రెండు గేదెలు పులి దాడిలో మృతి చెందాయి. మూడు రోజుల క్రితం పాపన్‌పేట అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లిన గేదెలు తిరిగి రాలేదు. అప్పటి నుంచి అటవీ ప్రాంతంలో వెతుకుతుండగా, ఆదివారం పిట్టనీ చెలిమ లొద్ది ప్రాంతంలో గేదెల కళేబరాలు కనిపించాయి.

Read Also : Brothals Arrest : వ్యభిచార గృహంపై పోలీసుల దాడి : 10 మంది యువతులతో సహా 23 మంది అరెస్ట్

వెంటనే గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి వచ్చిన అటవీశాఖ అధికారులు, సిబ్బంది అక్కడ కనిపించిన పులి పాదముద్రలను కొలతలు తీసుకున్నారు. పులి దాడిలోనే గేదెలు మృతి చెందినట్లు నిర్ధారించారు. తమకు నష్ట పరిహారం ఇప్పించాలని బాధిత రైతులు అటవీశాఖ అధికారులకు వినతి పత్రం అందచేశారు. గ్రామ సమీపంలో పులి జాడల నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.