Wine Shops : మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్…రెండు రోజులు వైన్స్ బంద్

ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీసులు అనుమతిచ్చిన వీధుల్లోనే శోభాయాత్ర జరపాలని నిర్వాహకులకు ఉన్నత న్యాయస్థానం...

Wine Shops : మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్…రెండు రోజులు వైన్స్ బంద్

Wines

Two Days Wine Shops : మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. రెండు రోజుల పాటు నగరంలో వైన్స్ బంద్ కానున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ లో మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read More : Vontimitta : ఒంటిమిట్ట రామాలయం.. బ్రహ్మోత్సవాలకు ముస్తాబు

హైదరాబాద్, భైంసాలో శ్రీరామనవమి శోభాయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రను హైదరాబాద్‌, భైంసాలో పోలీసుల మార్గదర్శకాల మేరకు నిర్వహించాలని కోర్టు స్పష్టం చేసింది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీసులు అనుమతిచ్చిన వీధుల్లోనే శోభాయాత్ర జరపాలని నిర్వాహకులకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Read More : Panakam Vadapappu : శ్రీరామనవమి పానకం, వడప్పప్పులో ఔషధగుణాల గురించి తెలిస్తే?

హైదరాబాద్‌, నిర్మల్‌ జిల్లా భైంసాలో కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో శోభాయాత్రకు అనుమతించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరపగా.. శాంతిభద్రతలు దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రాంతాలు, వీధుల్లో శోభాయాత్రకు అనుమతిచ్చినట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Read More : Sri Rama Navami : భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం.. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం

హైదరాబాద్‌లో సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర నిర్వహించుకోవచ్చునని హైకోర్టు తెలిపింది. బోయిగూడ కమాన్, మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ రోడ్డు, ధూల్ పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, బేగంబజార్ ఛత్రి, గౌలిగూడ చమన్, పుత్లీబౌలి చౌరస్తా మీదుగా సుల్తాన్ బజార్ చేరుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. భైంసాలో గోపాలదాస్ హనుమాన్ ఆలయం, పాత సోనా చాందినీ, కుబేర్ అడ్డా, బస్టాండ్, నిర్మల్ చౌరస్తా, రాంలీలా మైదాన్ మీదుగా ఊరేగింపు నిర్వహించుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. అయితే శోభాయాత్రకు 200 మంది వరకు అనుమతి ఉంటుందని.. మధ్యాహ్నం లోపు యాత్రను ముగించాలని ఆదేశించింది.