Abdullapurmet : హైదరాబాద్ లో యువతీయువకుల మృతదేహాల కలకలం.. హత్యా? ఆత్మహత్యా?

మృతదేహాలు పడి ఉన్న ప్రదేశంలో స్కూటీ ఉండటంతో యువతీయువకులు ఇక్కడి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారా అన్న అనుమానాలు కల్గుతున్నాయి.

Abdullapurmet : హైదరాబాద్ లో యువతీయువకుల మృతదేహాల కలకలం.. హత్యా? ఆత్మహత్యా?

Dead Bodies

Two dead bodies : హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో రెండు మృతదేహాలు కలకలం రేపాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జీ వద్ద గుర్తు తెలియని యువతీయువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. రెండు మృతదేహాలు నగ్నంగా పడి ఉన్నాయి. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో విచారిస్తున్నారు. మృతులు కవాడిగూడకు చెందినవారుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Electric Shock : భర్తకు కరెంట్ షాక్‌…కాపాడే క్రమంలో భార్యకూ షాక్.. ఇద్దరూ మృతి

మృతదేహాలు పడి ఉన్న ప్రదేశంలో స్కూటీ ఉండటంతో యువతీయువకులు ఇక్కడి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారా అన్న అనుమానాలు కల్గుతున్నాయి. అయితే ఇద్దరి మృతదేహాలు దుస్తులు లేకుండా పడి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.