GHMC Workers Kill : మ్యాన్ హోల్ లోకి దిగి ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు మృతి

హైదరాబాద్ వనస్థలీపురంలోని పద్మావతి కాలనీలో విషాదం నెలకొంది. మ్యాన్ హోల్ లోకి దిగిన ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు మృతి చెందారు.

GHMC Workers Kill : మ్యాన్ హోల్ లోకి దిగి ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు మృతి

Ghmc

GHMC workers killed : హైదరాబాద్ వనస్థలీపురంలోని పద్మావతి కాలనీలో విషాదం నెలకొంది. ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులను మ్యాన్ హోల్ మింగేసింది. మ్యాన్ హోల్ లోకి దిగిన ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు మృతి చెందారు. మున్సిపల్ సిబ్బంది ఒకరి మృతదేహాన్ని వెలికితీసింది. మరొక మృతదేహం కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

శివ, అంతయ్య అనే ఇద్దరు వ్యక్తులు జీహెచ్ఎంసీలో కార్మికులుగా పని చేస్తున్నారు. వీరిద్దరు డ్రైనేజీ రిపేర్ కోసం రాత్రి మ్యాన్ హోల్ లోకి దిగారు. రాత్రి పూట డ్రైనేజీ క్లీన్ చేసేందుకు అనుమతి లేదు. అయినప్పటికీ కాంట్రాక్టర్ ఒత్తడితో రాత్రి 11 గంటల సమయంలో డ్రైనేజీ క్లీన్ చేసేందుకు మ్యాన్ హోల్ లోకి దిగారు.

ముందు శివ అనే కార్మికుడు ఊబీలో చిక్కుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు వెళ్లిన అంతయ్య కూడా ఊబిలో చిక్కుకుని ఊపరి ఆడక మృతి చెందారు. ఆ సమయంలో మ్యాన్ హోల్ పై ఇద్దరు కార్మికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

మున్సిపల్ సిబ్బంది శివ అనే కార్మికుడి మృతదేహాన్ని బయటకు తీశారు. అంతయ్య మృత దేహం కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మృతులు చింతల్ బస్తీకి చెందిన శివ, అంతయ్యగా గుర్తించారు. దీంతో చింతల్ బస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. శివ భార్య 8 నెలల గర్బవతి. అతని మృతి విషయం ఆమెకు ఇంకా తెలియలేదు. అంతయ్యకు భార్య, కుమారు, కూతురు ఉన్నారు.