Two Infants Dead : హైదరాబాద్ లో ఇద్దరు బాలింతలు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన

హైదరాబాద్ లో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు బాలింతల ప్రాణం తీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఇద్దరు బాలింతలకు మలక్ పేట ప్రభుత్వ వైద్యులు డెలివరీ చేయగా వారు అస్వస్థతకు గురై మృతి చెందారు.

Two Infants Dead : హైదరాబాద్ లో ఇద్దరు బాలింతలు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన

MALAKPET

two infants dead : హైదరాబాద్ లో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు బాలింతల ప్రాణం తీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఇద్దరు బాలింతలకు మలక్ పేట ప్రభుత్వ వైద్యులు డెలివరీ చేయగా వారు అస్వస్థతకు గురై మృతి చెందారు. ముందస్తు పరీక్షలు చేయకుండా ఆపరేషన్ చేయడమే దీనికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెంగీ ఫీవర్ తో సిరివెన్నెల అనే బాలింత ప్లేట్ లెట్స్ ఒక్కసారిగా పడిపోయాయి. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో బాలింత సిరివెన్నల మృతి చెందారు.

ఇక మలక్ పేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 10న బిడ్డకు జన్మనిచ్చిన శివాని అనే మరో బాలింత బీపీ, షుగర్ తగ్గిపోవడంతో మృతి చెందారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయారు. దీంతో శిశువులతో ఇద్దరు బాలింతల మృతుల కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. చాదర్ ఘాట్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.

Andhra pradesh: వైద్యం వికటించి బాలింత మృతి

మలక్ పేట ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు బాలింతల మృతికి కారణమైనవారిని శిక్షించాలని బంధువులు ఆందోళన చేపట్టారు. బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలని పలు పార్టీలు ధర్నాకు దిగాయి. రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా అడిగితే రూ.5 లక్షలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బాధితుల కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.