Singareni Accident : సింగరేణి బొగ్గు గని ప్రమాదంలో ముగ్గురు మృతి

రామగుండం రీజియన్‌ పరిధిలోని అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టులో సోమవారం భూగర్భ గని పైకప్పు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న తేజ, జయరాయ్ మృతదేహాలను బయటికి తీశారు.

Singareni Accident : సింగరేణి బొగ్గు గని ప్రమాదంలో ముగ్గురు మృతి

Singareni (1)

Two killed in Singareni coal mine : పెద్దపల్లి జిల్లా సింగరేణి బొగ్గు గనిలో విషాదం చోటు చేసుకుంది. బొగ్గు కుప్పల కింద చిక్కుకున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ్, సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్, కాంట్రాక్టు కార్మికుడు శ్రీకాంత్ మృతి మృతి చెందారు. రెస్క్యూ టీం ముగ్గురి మృతదేహాలను బయటికి తీసింది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మొత్తం ఏడుగురు బొగ్గు కుప్పల కింద చిక్కుకోగా ప్రాణాలతో నలుగురు కార్మికులు బయటపడ్డారు.

రామగుండం రీజియన్‌ పరిధిలోని అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టులో సోమవారం భూగర్భ గని పైకప్పు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌ జయరాజ్‌, గని డిప్యూటీ మేనేజర్‌ తేజతోపాటు మరో ఐదుగురు కార్మికులు ప్రమాదంలో చిక్కుకోగా.. ముగ్గురిని సోమవారమే బయటికి తీసుకొచ్చారు. రవీందర్‌ను నిన్న రెస్క్యూ టీం కాపాడింది. శిథిలాల కింద చిక్కుకున్న తేజ, జయరాయ్, శ్రీకాంత్ కోసం గాలించి, ఇవాళ ముగ్గురి మృతదేహాలను బయటికి తీశారు.

Ukraine – Singareni : సింగరేణిపై రష్యా- యుక్రెయిన్ యుద్ధం ప్రభావం

ఈ ఘటన దురదృష్టకరమని, సింగరేణిలో ఎలాంటి భద్రతా లోపాలు లేవని సింగరేణి డైరెక్టర్‌ బలరాంనాయక్ అన్నారు. సింగరేణిలోనే అత్యంత అధునాతన విదేశీ పరిజ్ఞానంతో నడుస్తున్న అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టులో భారీ ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. మరోవైపు ప్రమాదంలో చిక్కుకుని ముగ్గురు మరణించడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.