TSPSC Paper Leak Case : లవర్ కోసం రూ.6లక్షలకు క్వశ్చన్ పేపర్ కొనుగోలు.. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

TSPSC Paper Leak : తన ప్రియురాలు సుస్మిత కోసం డీఏవో పేపర్ ను ప్రవీణ్ దగ్గర లౌకిక్ కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది.

TSPSC Paper Leak Case : లవర్ కోసం రూ.6లక్షలకు క్వశ్చన్ పేపర్ కొనుగోలు.. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

TSPSC Paper Leak (Photo : Google)

TSPSC Paper Leak Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉన్న నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సాయి లౌకిక్, సుస్మితను అరెస్ట్ చేశారు. తన ప్రియురాలు సుస్మిత కోసం డీఏవో(డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్) పేపర్ ను ప్రవీణ్ దగ్గర లౌకిక్ కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ పేపర్ కోసం రూ.6లక్షలు ప్రవీణ్ కు లౌకిక్ చెల్లించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ లో ఇప్పటివరకు 17మందిని అరెస్ట్ చేశారు.

Also Read..TSPSC paper leak: రూ.100 కోట్ల మేర దావా… రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసులు

సాయి లౌకిక్ కు తాను డీఏవో పేపర్ అమ్మినట్లు విచారణలో ప్రవీణ్ తెలిపాడు. దీంతో సిట్ అధికారులు సాయి లౌకిక్, సుస్మితను అదుపులోకి తీసుకుని విచారించగా, పేపర్ కొనుగోలు చేసినట్లు వారు నిజం ఒప్పుకున్నారు. వెంటనే పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

Also Read..TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ చైర్మన్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన సిట్.. పోలీసు కస్టడీకి మరో ముగ్గురు నిందితులు

ఫిబ్రవరి 6న డీఏవో పరీక్ష జరిగింది. పేపర్ లీకేజీ అంశం వెలుగులోకి వచ్చాక టీఎస్ పీఎస్ సీ డీఏవో పరీక్షను కూడా రద్దు చేసింది. టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీక్ అంశం రాష్ట్రంలో సంచలనంగా మారింది. రాజకీయ రంగు కూడా పులుముకుంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

ఈ కేసు విచారణను ప్రభుత్వం సిట్ కు అప్పగించింది. రంగంలోకి దిగిన సిట్.. ముమ్మరంగా దర్యాఫ్తు చేస్తోంది. ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి నుంచి కీలక వివరాలు రాబడుతున్నారు. ఇక, ఈ కేసులో సిట్ అధికారులు కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి స్టేట్ మెంట్ ను కూడా నమోదు చేశారు.

Also Read..Bandi Sanjay : మంత్రివర్గం నుంచి కేటీఆర్‌ను బర్త్‌రఫ్ చేయాలి : బండి సంజయ్ డిమాండ్

రాజకీయ దుమారం..
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. దీని వెనుక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హస్తం ఉందని బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. 30లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతల ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. రాజకీయ లబ్ది కోసం బీజేపీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.