Invests In Telangana : తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు

హైద‌రాబాద్‌లో 7 వేల చ‌దరపు మీటర్ల వైశాల్యంలో ల్యాబొరేట‌రీ ఏర్పాటు చేస్తామ‌ని స‌ర్ఫేస్‌ మెజ‌ర్ మెంట్ సిస్టమ్స్ పేర్కొంది. రెండేళ్లలో దీనిని విస్తరిస్తామ‌ని సంస్థ తెలిపింది. ఈ ల్యాబ్‌ను జాతీయ‌, అంత‌ర్జాతీయ ఫార్మా కంపెనీల ఔష‌ధ ప్రయోగాలకు వేదిక‌గా చేస్తామ‌ని ఆ సంస్థ ఎండీ చెప్పారు.

Invests In Telangana : తెలంగాణలో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడులు

Invests

Invests In Telangana : తెలంగాణ ఫార్మా రంగంలో మ‌రో అంతర్జాతీయ సంస్థ పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్‌కు చెందిన స‌ర్ఫేస్‌ మెజెర్ మెంట్ సిస్టమ్స్ పెట్టుబ‌డులు పెట్టేందుకు సుముఖ‌త వ్యక్తం చేసింది. పార్టిక‌ల్ క్యారెక్టరైజేష‌న్ లాబొరేట‌రీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్‌లో ప‌ర్యటిస్తున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌తో.. స‌ర్ఫేస్‌ మెజెర్ మెంట్ సంస్థ ఎండీ భేటీ అయ్యారు.

హైద‌రాబాద్‌లో 7 వేల చ‌దరపు మీటర్ల వైశాల్యంలో ల్యాబొరేట‌రీ ఏర్పాటు చేస్తామ‌ని స‌ర్ఫేస్‌ మెజ‌ర్ మెంట్ సిస్టమ్స్ పేర్కొంది. రెండేళ్లలో దీనిని విస్తరిస్తామ‌ని సంస్థ తెలిపింది. ఈ ల్యాబ్‌ను జాతీయ‌, అంత‌ర్జాతీయ ఫార్మా కంపెనీల ఔష‌ధ ప్రయోగాలకు వేదిక‌గా చేస్తామ‌ని ఆ సంస్థ ఎండీ చెప్పారు. హైద‌రాబాద్‌లో స‌ర్ఫేస్‌ మెజ‌ర్ మెంట్ సిస్టమ్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చినందుకు మంత్రి కేటీఆర్ ఆ సంస్థకు ధ‌న్యవాదాలు తెలిపారు.

CoCa Cola Investment: తెలంగాణలో కోకాకోలా మరో రూ.600 కోట్ల పెట్టుబడి: ప్రభుత్వంతో మూడు ఒప్పందాలు

ఫార్మా రంగంలో హైద‌రాబాద్ తిరుగులేని ఆధిప‌త్యానికి ఇదో నిద‌ర్శన‌మని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ రాష్ట్రానికి కూడా లేని అనుకూల‌త‌లు హైద‌రాబాద్‌కు ఉన్నాయ‌ని గుర్తు చేశారు. బ్రిటన్‌ టూర్‌ తర్వాత ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా జరిగే వరల్డ్‌ ఎకనమిక్ ఫోరంకు కేటీఆర్‌ హాజరవుతారు.