YS Sharmila : షర్మిలకు షాక్.. తమ ఇంటికి రావద్దన్న నిరుద్యోగి తండ్రి

ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న భూక్యా నరేష్ ఇంటివద్ద షర్మిల దీక్ష చేసేందుకు సిద్ధమవుతుండగా.. నరేష్ తండ్రి, భూక్యా శంకర్ ఓ వీడియో విడుదల చేశారు. షర్మిల తమ ఇంటికి రావద్దని తెలిపారు.

YS Sharmila : షర్మిలకు షాక్.. తమ ఇంటికి రావద్దన్న నిరుద్యోగి తండ్రి

Sharmila

YS Sharmila : వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగంపై ఆమె గట్టిగా ఫోకస్ చేశారు. తెలంగాణలో నిరుద్యోగులకు అండగా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని అనేక సార్లు మీడియా ముఖంగా తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తూ వారిలో దైర్యం నింపుతున్నారు.

తాజాగా ఆమె నల్గొండ, ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఇక మంగళవారం (24-08-2021) మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకున్న భూక్యా నరేష్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించి దీక్ష చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

అయితే ఈ తరుణంలోనే నరేష్ తండ్రి భూక్యా శంకర్ నాయక్.. ఓ వీడియో విడుదల చేశాడు. తన కొడుకు ఉద్యోగం రాక చనిపోయిన మాట వాస్తవమే అని.. కానీ దానిని రాజకీయంగా వాడుకోవద్దని హితవు పలికారు. తమ ఇంటికి రావద్దని షర్మిలకు తెలిపారు. తమకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందుతుందని తెలిపారు.