Amit Shah Unhappy With Telangana BJP Leaders : తెలంగాణ బీజేపీ నేతలపై అమిత్ షా అసంతృప్తి.. పార్టీలో ఐక్యత కొరవడిందంటూ అసహనం

తెలంగాణ బీజేపీ నేతలపై కేంద్ర మంత్రి అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ నాయకత్వం అంచనాలను అందుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో ఐక్యత కొరవడినట్లు సమచారం ఉందని పేర్కొన్నారు. ప్రజల్లో బీజేపీపై ఆసక్తి ఉందన్నారు.

Amit Shah Unhappy With Telangana BJP Leaders : తెలంగాణ బీజేపీ నేతలపై అమిత్ షా అసంతృప్తి.. పార్టీలో ఐక్యత కొరవడిందంటూ అసహనం

Amit Shah Unhappy With Telangana BJP Leaders

Amit Shah Unhappy With Telangana BJP Leaders : తెలంగాణ బీజేపీ నేతలపై కేంద్ర మంత్రి అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ నాయకత్వం అంచనాలను అందుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో ఐక్యత కొరవడినట్లు సమచారం ఉందని పేర్కొన్నారు. ప్రజల్లో బీజేపీపై ఆసక్తి ఉందన్నారు. నాయకులు ఇంకా కష్టపడితేనే ఫలితం ఉంటుందని చెప్పారు. బండి సంజయ్ పాదయాత్రకు స్పందన బాగుందని తెలిపారు. మిగతా నేతలు సైతం ప్రజల్లో ఉండాలని సూచించారు.

టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై మరింత దూకుడుగా వెళ్లాలన్నారు. మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ పెంచాలని అమిత్ షా ఆదేశించారు. ఉప ఎన్నిక కోసం త్వరలో కమిటీని నియమించాలని నిర్ణయించారు. మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. మునుగోడులో గెలిచి తీరాల్సిందేనని చెప్పారు. ప్రతీ గ్రామానికి ముగ్గురితో కమిటీలు నియమించాలన్నారు.

Amit shah slams kcr: అందుకే సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదు: అమిత్ షా

కమిటీలో రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయి నేతలు ఉండాలని సూచించారు. మూడు రోజుల్లో కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. అమిత్ షాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐదు నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడారు. అమిత్ ను కలిసిన అనంతరం తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు.