Amit Shah : అమిత్ షా పర్యటన వివరాలు..ఏ సమయంలో ఎక్కడ ఉంటారంటే.. amit shah to visit telangana on may 14 to Praja Sangrama Yatra public meeting

Amit Shah : అమిత్ షా పర్యటన వివరాలు..ఏ సమయంలో ఎక్కడ ఉంటారంటే..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారైంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండో విడత ప్రజా సంగ్రమ యాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభకు షా హాజరు కానున్నారు.

Amit Shah : అమిత్ షా పర్యటన వివరాలు..ఏ సమయంలో ఎక్కడ ఉంటారంటే..

Amit Shah TS Tour : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారైంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండో విడత ప్రజా సంగ్రమ యాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభకు షా హాజరు కానున్నారు. ఈనెల 14న హైదరాబాద్‌కు రానున్న అమిత్‌ షా.. మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట విమానాశ్రయింలో ల్యాండ్ కానున్నారు. బేగంపేట చేరుకోనున్న షాకు డీకే అరుణ,లక్ష్మణ్ తో సహా 20మంది బీజేపీ నేతలు స్వాగతం పలకనున్నారు.

3 గంటలకు సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీని సందర్శించి సాయంత్రం 4.30 గంటల వరకు ఉండనున్నారు. అలాగే 5 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని నోవా టెల్‌ హోటల్‌కు వెళ్లనున్నారు. 6.30 గంటలకు హైదరాబాద్‌ సమీపంలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో అమిత్‌ షా హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు సభ స్థలి నుంచి ఎయిర్‌పోర్టుకు వచ్చి రాత్రి 8.25 గంటలకు ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు. కాగా, అమిత్‌ షా పర్యటన ఖరారు కావడంతో సభకు భారీ సంఖ్యలో ప్రజలను సమీకరించడంలో బీజేపీ నిమగ్నమైంది.

 

×