Singareni : సింగరేణిని రక్షించడంలేదు భక్షిస్తున్నారు : కిషన్ రెడ్డి

సింగరేణిలో అంతర్గత ప్రైవేటీకరణ, ఆర్ధిక పరిస్థితి, పరిపాలనా పతనం,సింగరేణి సిబ్బందిని తగ్గించడం,భద్రత లోపించడం అన్ని వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Singareni : సింగరేణిని రక్షించడంలేదు భక్షిస్తున్నారు : కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy

Singareni : తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న బంగారు గనిగా ఉన్న సింగరేణి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ..సింగరేణిలో అంతర్గత ప్రైవేటీకరణ,అద్వాన్నమైన ఆర్ధిక పరిస్థితి, పరిపాలనా పతనం,సింగరేణి సిబ్బందిని తగ్గించడం,భద్రత లోపించడం అన్ని వ్యవహారాల్లో రాజకీయ జోక్యం మాములుగా మారిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.ఎన్నికలు వచ్చినవుడే సింగరేణి కార్మికులు ప్రభుత్వానికి గుర్తువస్తారని..ఎన్నికలప్పుడే సింగరేణి కార్మికుల సమస్యలు బీఆర్ఎస్ నాయకులు ప్రస్తావిస్తారని ఎద్దేవా చేశారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని కానీ అమలు చేయలేదన్నారు.

దేశమంతటా విస్తరిస్తాం..అంతర్జాతీయంగా గనులను లీజుకు తీసుకుంటాం అభివృద్ధి చేస్తామన్నామని వాగ్ధాలు చేసిన మరి అవన్నీ ఏమయ్యాయో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.సింగరేణి లో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోందని..కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 20 వేల పర్మినెంట్ ఉద్యోగాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం కోత విధించిందని..16 వేల కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకుని పని దోపిడీ చేస్తోందని ఆరోపించారు.

తెలంగాణను సాధించు ..సింగరేణిని రక్షించు అని నినదించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి సింగరేణిని భక్షించే విధానాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి బకాయిలు 10 వేల కోట్లు దాటాయని..సింగరేణి కి రావాల్సిన బకాయిలు 4 వేల కోట్లు రావాలన్నారు.టీఎస్ జేన్ కో నుంచి 2600 కోట్లు, టీఎస్ ట్రాన్స్ కో నుంచి 18 వేల కోట్లు రావాలని..సింగరేణికి బొగ్గు అమ్మకాల ద్వారా ,విద్యుత్ బకాయిలు అన్ని కలిపి 25 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలని తెలిపారు. 3500 కోట్లు బాంక్ బ్యాలెన్స్ ఉండే సంస్థ కేసీఆర్ పాలనలో సింగరేణి సంస్థ అప్పులు చేస్తే కానీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉందని దుయ్యబట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.