Kishan Reddy : సచివాలయానికి రాని ముఖ్యమంత్రికి కొత్త సచివాలయం ఎందుకు : కిషన్ రెడ్డి

ఇప్పటికే 8లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని.. చేసిన అప్పులు ఎలా తిరిగి చెల్లిస్తారని నిలదీశారు. బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులే లక్షా 30 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిపారు.

Kishan Reddy : సచివాలయానికి రాని ముఖ్యమంత్రికి కొత్త సచివాలయం ఎందుకు : కిషన్ రెడ్డి

Kishan Reddy - KCR

Kishan Reddy comments KCR : ఏ ఒక్క కుటుంబం, వ్యక్తి, పార్టీ ద్వారానో తెలంగాణ రాలేదని.. సబ్బండ వర్గాల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ఆకాంక్షల మేరకు పాలన సాగుతుందా అని ప్రశ్నించారు. అవినీతి భారీగా పెరిగిపోయిందన్నారు. రాష్ట్రంలో మాఫియాలు పేట్రేగిపోతున్నాయని తెలిపారు. తెలంగాణ నేడు అప్పుల కుప్పగా మారిందని ఎద్దేవా చేశారు.

మనం రాష్ట్రం తెచ్చుకున్నది అప్పుల కోసమా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్ లు తొలగిస్తే గిరిజనులకు చట్టపరమైన రిజర్వేషన్ లు అమలవుతాయని తెలిపారు. ఈ మేరకు కిషన్ రెడ్డి హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఫాం హౌస్ ల మీద ఫాం హౌస్ లు పెరుగుతున్నాయని.. కానీ, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మాత్రం రావడం లేదని ఎద్దేవా చేశారు. ఉద్యమ ద్రోహులకు ప్రభుత్వంలో పెద్దపీట వేశారని విమర్శించారు.

Mid Day Meal : మధ్యాహ్న భోజనంలో మార్పులు.. ప్రతిరోజు పప్పన్నం, మెనూలో కొత్తగా కిచిడీ

అధికారంలో ఉన్న పార్టీ నేతల కుటుంబాలు బంగారంగా మారాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలు మాఫియా గా మారి దళిత బంధు దోచుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలోని సకల రంగాల్లో అవినీతి, అహంకారం, కుటుంబ పాలన, నియంతృత్వం తప్ప మరేదీ లేకుండా పోయిందన్నారు. ఫ్లై ఓవర్ లతో పూర్తి సమస్యలు పరిష్కారం కావని తెలిపారు. బస్తీలలో నీటి కోసం, డ్రైనేజీ వ్యవస్థ కోసం, ఇళ్ల కోసం పేదలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. పేదలకు కట్టిస్తానన్న ఆసుపత్రులు ఏమయ్యాయని నిలదీశారు.

సచివాలయానికి రాని ముఖ్యమంత్రికి కొత్త సచివాలయం ఎందుకు అని ప్రశ్నించారు. ప్రజలకు అనుమతి లేని సచివాలయం ఎందుకని నిలదీశారు. అమరుల కుటుంబాలు ఎలాంటి సహకారం లేకుండా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చేసిన అప్పులను కట్టలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం వస్తున్న రెవెన్యూ ఇప్పటికే చేసిన అప్పు కట్టడానికి సరిపోతుందన్నారు.

Hijab: మధ్యప్రదేశ్ పాఠశాలలో మళ్లీ హిజాబ్ వివాదం…విచారణకు సర్కారు ఆదేశం

ఇప్పటికే 8లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని.. చేసిన అప్పులు ఎలా తిరిగి చెల్లిస్తారని నిలదీశారు. బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులే లక్షా 30 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిపారు. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థలతో చేసిన అప్పులు భారీగా పేరుకు పోయాయని పేర్కొన్నారు. కేంద్ర పీఎస్ యూ, సంస్థల నుంచి లక్షల కోట్లు ఇచ్చామని తెలిపారు. రుణాలు ఇచ్చింది తెలంగాణ అభివృద్ధి కోసమే.. ఏ ఒక్క వ్యక్తికి ఇవ్వలేదన్నారు.

కేంద్రం రైతులకు 18వేల కోట్ల రూపాయల సాయం చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 24వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం ఎరువుల సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. లక్షా 20 వేల కోట్ల రూపాయలలు జాతీయ రహదారుల కోసం ఖర్చు చేశామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

3D Printed Temple : ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ దేవాలయం.. తెలంగాణలోని సిద్ధిపేటలో

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ నిర్మాణం కోసం సర్వే ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పిందన్నారు. తెలంగాణలో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభం చేశామని తెలిపారు. పేదలకు ఇళ్లు, మంచినీరు, ఆయుష్మాన్ భారత్ కార్డులు అందిస్తున్నామని పేర్కొన్నారు. పంటనష్ట పరిహారం కోసం తెచ్చిన ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయడం లేదని విమర్శించారు.

మోదీ, కేంద్ర ప్రభుత్వం కారణంగా దేశంలో పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాకముందే ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్ ప్రెస్ వే ఉదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసన్నారు. తాము దేశంలో ఆదర్శవంతమైన, నీతివంతమైన పాలన అందిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల్లో రగులుతున్న ఆవేదననే తాను చెబుతున్నట్లు పేర్కొన్నారు.