Kishan Reddy : విచారణ జరిపితే కేసీఆర్ అవినీతి చేశారో లేదో తేలిపోతుంది-కిషన్‌రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసిందో లేదో విచారణ జరిపితే తేలుతుందని  కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Kishan Reddy : విచారణ జరిపితే కేసీఆర్ అవినీతి చేశారో లేదో తేలిపోతుంది-కిషన్‌రెడ్డి

Kishna Reddy Kcr

Kishan Reddy :  కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసిందో లేదో విచారణ జరిపితే తేలుతుందని  కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  హైదరాబాద్ హచ్ఐసీసీలో  రెండు రోజుల పాటు జరిగన  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…ఎనిదేళ్ళలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అవినీతిలో కూరుకుపోయిందని…. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని చెప్పారు.

పనిలేక మంత్రులు డమ్మీలుగా మారారని ఆయన అన్నారు. కేంద్రం పంపే నిధులను కేసీఆర్ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని మంత్రి ఆరోపించారు. కమిషన్ల‌ కోసమే 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే  కాళేశ్వరం ప్రాజక్టును రూ.1.30లక్షల కోట్లకు పెంచారని కిషన్ రెడ్డి వివరించారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, నెట్టెంపాడు ప్రాజక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆయన తెలిపారు.

తెలంగాణ ఏర్పాటు వెనుక యువకుల బలిదానాలు..‌దశాబ్దాల బీజేపీ పోరాటం ఉందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. నీళ్ళు నిధులు నియామకాలు విషయంలో తెలంగాణ వచ్చాక కూడా అన్యాయం జరుగుతోందని మంత్రి అన్నారు. పేదలకు విద్య, వైద్యం అందించటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆయన అన్నారు.

కేసీఆర్ పాలన పట్ల దళితులు, రైతులు, యువత, మహిళలు ఆవేదనలో ఉన్నారని…ప్రజలిచ్చిన అవకాశాన్ని కేసీఆర్ పోగొట్టుకున్నారని..మోదీ స్ఫూర్తితో బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి తెస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Also Read : BJP National Executive Meeting : ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు