Nirmala Sitharaman : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల వల్ల .. తెలంగాణలో పుట్టే ప్రతి బిడ్డపై రూ.1.25 లక్షల అప్పు
లంగాణలోని కామారెడ్డి జిల్లాలో పర్యటించిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పుల వల్ల తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడిపై రూ.1.25లక్షల అప్పు ఉందని తెలిపారు.

minister Nirmala Sitharaman : తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో పర్యటించిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ..మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పుల వల్ల తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడిపై రూ.1.25లక్షల అప్పు ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాల పేర్లను మార్చుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్రం ఒకపేరు పెడితే.. రాష్ట్రం ఇంకో పేరు పెడుతోందని విమర్శించారు. రాష్ట్రాలు చేసే అప్పులపై అడిగే హక్కు కేంద్రానికి ఉందని మంత్రి అన్నారు.
తెలంగాణలో ప్రతి 100 మందిలో 91 మంది రైతులు అప్పులపాలయ్యారు. ఫసల్ బీమాయోజన ఎందుకు ఇవ్వడం లేదు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. రూ.లక్ష రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారు. రైతు బీమా కౌలు రైతులకు ఎందుకివ్వరు? అన్ని ప్రశ్నించారు. ప్రజలకు వాగ్దానాలు చేస్తున్నారు తప్ప ప్రభుత్వం వాటిని అమలు చేయటంలేదని విమర్శించారు. మిగులు బడ్జెట్ కాస్తా లోటు బడ్జెట్ అయ్యింది. బడ్జెట్ అప్రూవల్ కంటే ఎక్కువగా అప్పులు చేస్తున్నారు. బయట తీసుకునే అప్పులు అసెంబ్లీకి తెలియడంలేదు.
బడ్జెట్‌లో చాలా అప్పులు చూపించడం లేదని అన్నారు. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉందని మంత్రి స్పష్టంచేశారు. తెలంగాణలో పుట్టే ప్రతి పిల్లాడిపై రూ.1.25లక్షల అప్పు ఉంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని తెలంగాణ దాటిపోయింది. దేశం మొత్తం తిరిగే ముందు మీ రాష్ట్రానికి మీరు సమాధానం చెప్పండి. లిక్కర్ స్కామ్‌లో ఎవరిపై ఆరోపణలు వచ్చాయో వాళ్లే సమాధానం చెప్పి తీరాలన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.