Telangana Unlock 2.0 : తెలంగాణలో మరిన్ని లాక్‌డౌన్ సడలింపులు!

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుడటంతో రాష్ట్ర ప్రభుత్వం మరిన్నిసడలింపులు ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ దిశగానే లాక్ డౌన్ సడలింపులపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Telangana Unlock 2.0 : తెలంగాణలో మరిన్ని లాక్‌డౌన్ సడలింపులు!

Unlock 2 0 More Lockdown Relaxations To Be Allowed In Telangana State

Telangana Unlock 2.0 : తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుడటంతో రాష్ట్ర ప్రభుత్వం మరిన్నిసడలింపులు ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ దిశగానే లాక్ డౌన్ సడలింపులపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ఎల్లుండి (శనివారం) నుంచి అన్ లాక్ 2.0 అమల్లోకి రానుంది. రాష్ట్రంలో మరికొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే లాక్ డౌన్ కేవలం నైట్ కర్ఫ్యూకి మాత్రమే పరిమతమయ్యే అవకాశం ఉంది. ఇక సినిమా హాల్స్, జిమ్ లు, బార్లు, పబ్ లకు 50 శాతం ఆక్సుపెన్సీతో అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ కర్ఫ్యూ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకు లాక్ డౌన్ సడలించింది. ఈ లాక్ డౌన్ సమయంలోనే అవసరమైన పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నెల 19తో ప్రస్తుత లాక్‌డౌన్‌ గడువు ముగియనుంది. 20వ తేదీ నుంచి సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలుపై కేబినెట్‌ భేటీలో సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంత్రులతో మాట్లాడి తర్వాత ప్రకటన చేసే అవకాశం ఉంది.

సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ అమలు చేసేలా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ ఏడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్‌డౌన్‌ సడలించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇళ్లకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. తెలంగాణలో కరోనా రెండో వేవ్‌ కట్టడికి మే 12వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.