హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..త్వరలో మెట్రో పరుగులు !

  • Published By: madhu ,Published On : August 29, 2020 / 06:36 AM IST
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..త్వరలో మెట్రో పరుగులు !

హైదరాబాద్ వాసులకు ఇక మంచి రోజులు రానున్నాయి. కొన్ని నెలలుగా షెడ్లకే పరిమితమైన మెట్రో రైళ్లు పరుగులు తీయడానికి సిద్ధమౌతున్నాయి. కరోనా కారణంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ సెప్టెంబర్ 31వ తేదీతో ముగియనుంది. అన్ లాక్ 4లో భాగంగా..మరికొన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని సమాచారం. అందులో మెట్రో రైళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.



హైదరాబాద్ లో మెట్రో ప్రారంభంతోనే సూపర్ అనిపించుకుంది. రోజు లక్షలాది మంది గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా..తక్కువ సమయంలోనే..ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉండడంతో నగర ప్రజలు దీనిని ఆదరించారు.
https://10tv.in/mumbai-restaurant-to-pay-rs-2-lakh-in-penalty-for-overcharging-customer-rs-10-for-ice-cream/
కానీ..లాక్ డౌన్ కారణంగా గత ఆరు నెలల నుంచి మెట్రో రైళ్లు కూత పెట్టడం లేదు. అంతేగాకుండా..హైదరాబాద్ లో బస్సులు రోడ్డెక్కలేదు. ప్రజా రవాణా వ్యవస్థ ఇంకా నగరంలో ప్రారంభం కాలేదు. రోజు వారు పని చేసే వారు, చిరు వ్యాపారులు, ఆఫీసులకు వెళ్లే వారు, ఇతర ప్రైవేటు ఉద్యోగుల రవాణా ఖర్చు తడిసి మోపడవుతోంది.



ప్రస్తుతం కోవిడ్ నిబంధనలపై రైల్వే అధికారులు కసరత్తులు జరుపుతున్నారు. తక్కువ మందిక అనుమతినిస్తూ..మెట్రో రైళ్లను ప్రారంభించాలని అనుకుంటున్నారు. సెప్టెంబర్ 01వ తేదీ నుంచి నగరంలో మెట్ర రైళ్లు పరుగులు తీస్తాయా ? లేదా ? అనేది రెండు, మూడు రోజుల్లో తెలియనుంది.