Telangana Unlock guidelines: తెలంగాణలో అన్‌లాక్ గైడ్‌లైన్స్.. మాస్క్ లేకుంటే రూ.వెయ్యి ఫైన్

Telangana Unlock guidelines: తెలంగాణలో అన్‌లాక్ గైడ్‌లైన్స్.. మాస్క్ లేకుంటే రూ.వెయ్యి ఫైన్

Telangana

Unlock guidelines: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించగా.. ఈమేరకు ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గడంతో పూర్తి లాక్‌డౌన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన గైడ్‌లైన్స్‌ ప్రకారం.. రాష్ట్రంలో మాస్క్ వేసుకోవడం తప్పనిసరి అని ప్రకటించింది. మాస్క్ లేకుండా కనిపిస్తే ఎవరైనా సరే రూ. వెయ్యి ఫైన్ కట్టాలంటూ ప్రభుత్వం ఆదేశించింది.

ఇదే సమయంలో ఆఫీసులు, దుకాణాలు తదితర ప్రదేశాల్లో జనాలు ఎక్కువగా గుమికూడకుండా కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. అదేవిధంగా కరోనా వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో శనివారం భేటీ అయిన మంత్రివర్గం ఆస్పత్రుల నిర్మాణ విషయమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం తదితర కరోనా నియమావళిని అనుసరించాలని కేబినెట్ కోరింది.

తెలంగాణలో అన్‌లాక్‌ గైడ్‌లైన్స్:
బహిరంగ ప్రదేశాలు, వర్క్ ప్లేస్‌లలో మాస్క్‌ ధరించడం తప్పనిసరి.
మాస్క్‌ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా కట్టాలి.
ఆఫీసులు, దుకాణాల్లో కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.
భౌతిక దూరం, శానిటైజేషన్‌ తప్పనిసరి.
నిబంధనలు పాటించకుంటే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద చర్యలు