UP CM Yogi : పాతబస్తీ భాగ్యలక్ష్మిఅమ్మవారిని దర్శించుకోనున్న యూపీ సీఎం యోగి..చార్మినార్ వద్ద భారీ బందోబస్తు

యోగి ఆదిత్యనాథ్ రానుండటంతో భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్మినార్‌ వద్ద కేంద్ర బలగాలను సైతం మోహరించారు. ఆదిత్యనాథ్‌పాటు పలువురు బీజేపీ నాయకులు సైతం అమ్మవారి దర్శనానికి రానుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

UP CM Yogi : పాతబస్తీ భాగ్యలక్ష్మిఅమ్మవారిని దర్శించుకోనున్న యూపీ సీఎం యోగి..చార్మినార్ వద్ద భారీ బందోబస్తు

UP CM Yogi : హైదరాబాద్ పాతబస్తీలో హైటెన్షన్‌ వాతావరణం కొనసాగుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం నగరానికి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాసేపట్లో పాతబస్తీకి వెళ్లనున్నారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆయన వెంట బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ లు కూడా ఓల్డ్ సిటీకి వెళ్లనున్నారు.

యోగి ఆదిత్యనాథ్ రానుండటంతో భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చార్మినార్‌ వద్ద కేంద్ర బలగాలను సైతం మోహరించారు. ఆదిత్యనాథ్‌పాటు పలువురు బీజేపీ నాయకులు సైతం అమ్మవారి దర్శనానికి రానుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటుచేశారు.

Viral Video : ఆలయంలో అద్భుతం.. శివలింగంపై మంచు.. మహాశివుని మహిమే.. వీడియో!

ముందస్తు చర్యల్లో భాగంగా చార్మినార్, మక్కా మసీద్, గుల్జర్ హౌస్, లాడ్ బజార్, హుసేనీ అలం, మొఘల్‌పుర, సర్దార్ మహల్ రోడ్, చౌమహల్ కిల్వట్ ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తుతోపాటు ప్లాటూన్ టీమ్స్‌ను మోహరించారు. సౌత్ జోన్ డీసీపీ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ సిటీ ఆర్మ్ రిజర్వ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్, మఫ్టీ క్రైమ్ పార్టీ తెలంగాణ పోలీస్ బెటాలియన్, 3 ప్లాటూన్ మహిళ పోలీస్ బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.