Uppal Stadium: అందుబాటులోకి ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్లు.. ఆన్‌లైన్‌లో 29 వేల టిక్కెట్ల విక్రయం

శుక్రవారం (జవనరి 13) నుంచి ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు హెచ్‌సీఏ తెలిపింది. పేటీఎమ్ యాప్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు వెల్లడించింది.

Uppal Stadium: అందుబాటులోకి ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్లు.. ఆన్‌లైన్‌లో 29 వేల టిక్కెట్ల విక్రయం

Uppal Stadium: ఈ నెల 18న హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో ఇండియా–న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఏర్పాట్లు పూర్తి చేసింది.

India vs Spain: హాకీ ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభం.. స్పెయిన్‌పై 2–0 గోల్స్‌తో గెలుపు

ఈ మ్యాచ్‌కు సంబంధించి టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం (జవనరి 13) నుంచి ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు హెచ్‌సీఏ తెలిపింది. పేటీఎమ్ యాప్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్నట్లు వెల్లడించింది. హెచ్‌సీఏ తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 29 వేల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే, శుక్రవారం 6 వేల టిక్కెట్లు మాత్రమే ఆన్‌లైన్‌లో ఉంచారు.

CI SUDHAKAR: భూ వ్యవహారంలో మోసం.. అంబర్‌‌పేట సీఐ సుధాకర్ అరెస్టు

మిగతా టిక్కెట్లను దశలవారీగా అందుబాటులోకి తెస్తారు. ఈ నెల 16, సోమవారం వరకు టిక్కెట్లు ఆన్‌లైన్‌లో ఉంటాయి. ఇటీవల ఉప్పల్‌లో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, వచ్చే వారం జరగబోయే మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను కేవలం ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వాళ్లు వాటికి సంబంధించిన క్యూఆర్ కోడ్ చూపించి ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలలో ఫిజికల్ టిక్కెట్లు తీసుకోవచ్చు.

Russia: సొలెడార్‌‌ను స్వాధీనం చేసుకున్నామన్న రష్యా.. తమ ఆధీనంలోనే ఉందన్న యుక్రెయిన్

వీటిని మాత్రం ఈ నెల 18 వరకు అందిస్తారు. మరో రెండు రోజుల్లో న్యూజిలాండ్ జట్టు హైదరాబాద్ చేరుకుంటుంది. మరుసటి రోజు టీమిండియా చేరుకుంటుంది. తర్వాత రెండు జట్లూ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాయి. 18న మ్యాచ్‌లో పాల్గొంటాయి.