Uppal Cricket Match: నేడు ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం.. ఆధార్ కార్డు తప్పనిసరి అంటున్న హెచ్‌సీఏ

హైదరాబాద్‌లో జరిగే క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న అభిమానులకు గుడ్ న్యూస్. గురువారం ఉదయం నుంచే టిక్కెట్ల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రకటించింది. సాయంత్రం ఐదు గంటల వరకు టిక్కెట్ల విక్రయాలు కొనసాగుతాయి.

Uppal Cricket Match: నేడు ఉప్పల్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం.. ఆధార్ కార్డు తప్పనిసరి అంటున్న హెచ్‌సీఏ

IPL 2023

Uppal Cricket Match: హైదరాబాద్ క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఆఫ్‌లైన్‌ టిక్కెట్ల విక్రయాలు గురువారం ఉదయం నుంచే ప్రారంభం కానున్నాయి. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫ్‌లైన్‌ టిక్కెట్లను విక్రయిస్తామని హెచ్‌సీఏ ప్రకటించింది.

Quadruplets Joy: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. ఒడిశాలో జన్మనిచ్చిన మహిళ

జింఖానా గ్రౌండ్ వద్ద టిక్కెట్ల అమ్మకాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రతినిధులు తెలిపారు. అయితే, ఈ కౌంటర్ల ద్వారా ఒక్కరికి రెండు టిక్కెట్లు మాత్రమే విక్రయిస్తామని చెప్పింది. అది కూడా ఆధార్ కార్డు ఉన్న వారికే ఇస్తామని చెప్పింది. దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డులు తీసుకొస్తేనే టిక్కెట్లు ఇస్తామని చెప్పడం సరికాదని క్రికెట్ అభిమానులు అంటున్నారు. టిక్కెట్ల కోసం గత నాలుగు రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న టిక్కెట్లను కూడా హెచ్‌సీఏ క్యాన్సిల్ చేసింది. దీంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆఫ్‌లైన్‌ టిక్కెట్ల విషయంలో స్పష్టత లేదు. దీంతో హెచ్‌సీఏ తీరును నిరసిస్తూ అభిమానులు జింఖానా గ్రౌండ్ వద్ద ఆందోళన చేపట్టారు.

PFI Members Arrested: వంద మంది పీఎఫ్ఐ నేతల అరెస్ట్.. కొనసాగుతున్న ఎన్ఐఏ సోదాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ దాడులు

మూడు, నాలుగు రోజుల నుంచి టిక్కెట్ల కోసం పడిగాపులు పడుతున్నారు. గురువారం కూడా వేకువఝాము నుంచే టిక్కెట్ల కోసం అభిమానులు బారులు తీరి ఉన్నారు. టిక్కెట్ల కోసం ఎంతసేపైనా ఎదురు చూస్తామని వారు అంటున్నారు. ఈ నెల 25న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ ఉప్పల్‌లో జరగబోతున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో మ్యాచ్ జరుగుతుండటంతో టిక్కెట్ల కోసం డిమాండ్ పెరిగింది.