V.Hanumantha Rao: కర్ణాటకలో హామీల అమలు.. ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారం చేస్తే ఆ ప్రభావం..: వీహెచ్

ఇవాళ వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి... నెరవేర్చలేదని చెప్పారు.

V.Hanumantha Rao: కర్ణాటకలో హామీల అమలు.. ప్రియాంక గాంధీ తెలంగాణలో ప్రచారం చేస్తే ఆ ప్రభావం..: వీహెచ్

V.Hanumantha Rao

V. Hanumantha Rao – Congress: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra ) తెలంగా ణ((Telangana)లో ప్రచారం చేస్తే ఆ ప్రభావం బాగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) అన్నారు. కర్ణాటక( Karnataka)లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నికల హామీలను అమలు చేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఏర్పడినా ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తి తమ పార్టీకి ఉందని చెప్పారు.

ఇవాళ వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు… నెరవేర్చలేదు. బీఆర్ఎస్ పార్టీ పెట్టి మహారాష్ట్రలో తిరుగుతూ రైతు రాజ్యం అంటున్నారు. కేసీఆర్ ఖమ్మంలో రైతులు ధర్నా చేస్తే వారికి సంకెళ్లు వేశారు. రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించిన చరిత్ర కేసీఆర్ కు దక్కుతుంది.

తెలంగాణలో ఉన్న వారికి పరిహారం ఇవ్వకుండా పంజాబ్, బిహార్ వారికి కేసీఆర్ డబ్బులు ఇచ్చారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ మాటకు కట్టుబడి ఉంటుంది. తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు. పేద ప్రజలపై మోదీకి ప్రేమ లేదు.

బండారు దత్తాత్రేయ తెలంగాణ కోసం పోరాడితే నిన్న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరిపిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేంద్రం పిలవలేదు. బడుగు, బలహీన వర్గాలకు బీజేపీ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కేసీఆర్ బీసీ బంధు అని బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి.

మాటలు చెప్పే మోదీ, కేసీఆర్ ను ఓడించాలి. అనేకమంది పిల్లలు ఐఐటీ, ఐఐఎం చదవడానికి కాంగ్రెస్ కారణం. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు ఓబీసీ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశాము. 1993లో మండల్ కమీషన్ వచ్చినా ఇప్పటికీ అమలు కావడం లేదు. కాంగ్రెస్ లో ఎవరైనా చేరవచ్చు కానీ ఐదేళ్ల వరకు పదవులు ఇవ్వవద్దు.

కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని ఉదయ్ పూర్ డిక్లరేషన్ లో చెప్పారు. 20 ఏళ్ల తర్వాత ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం” అని అన్నారు.

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంపై సినీ ప్రముఖుల స్పందన.. ఎన్టీఆర్, అనుష్క, సల్మాన్..