Vaccine Second Dose: వ్యాక్సినేషన్‌పై క్లారిటీ.. మే చివరి వరకు మాత్రమే సెకండ్ డోస్..

వ్యాక్సినేషన్‌పై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ సర్కార్‌. ఈ నెలాఖరు వరకు కూడా.. సెకండ్‌ డోస్‌ టీకా మాత్రమే ఇస్తామని చెప్పారు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్. అప్పటివరకూ ఫస్ట్‌ డోస్‌ కోసం ఎవరూ వ్యాక్సిన్‌ సెంటర్లకు రావొద్దని సూచించారు.

Vaccine Second Dose: వ్యాక్సినేషన్‌పై క్లారిటీ.. మే చివరి వరకు మాత్రమే సెకండ్ డోస్..

Vaccination Second Dose Only For May End Telangana Govt

Vaccination Second Dose : వ్యాక్సినేషన్‌పై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ సర్కార్‌. ఈ నెలాఖరు వరకు కూడా.. సెకండ్‌ డోస్‌ టీకా మాత్రమే ఇస్తామని చెప్పారు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్. అప్పటివరకూ ఫస్ట్‌ డోస్‌ కోసం ఎవరూ వ్యాక్సిన్‌ సెంటర్లకు రావొద్దని సూచించారు. సెకండ్‌ డోస్‌ టీకాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ అవసరం లేదని.. నేరుగా సెంటర్‌కు వెళ్లి సెకండ్‌ డోస్‌ వేయించుకోవచ్చని చెప్పారాయన.

రాష్ట్రంలో ఇంకా 15 లక్షల మందికి మే 31లోపు వారికి రెండో డోస్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్నారు డీహెచ్. కోవిషీల్డ్ రెండో డోసును ఆరు నుంచి ఎనిమిది వారాల మధ్యలో తీసుకోవాలని.. కోవాగ్జిన్‌ టీకాను నాలుగు నుంచి ఆరు వారాల మధ్యలో తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మిగతా వారికి దశల వారీగా టీకాను అందిస్తామని స్పష్టం చేశారు డీహెచ్‌ శ్రీనివాస్‌. ఆరోగ్య సేవల విషయంలో లాక్‌డౌన్‌ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని.. కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ల కోసం బయటకు వచ్చే వారికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉందన్నారు శ్రీనివాస్‌.

తగిన పత్రాలు చూపి పోలీసుల అనుమతి పొందవచ్చని చెప్పారు. ఇక లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసరం అయితే తప్ప.. ప్రజలెవరూ బయటకు రావొద్దని కోరారు డీహెచ్‌ శ్రీనివాస్. లాక్‌డౌన్ మినహాయింపు సమయంలో ప్రజలందరూ అత్యంత జాగ్రత్తతో ఉండాలన్నారు. ప్రభుత్వం అనుమతించిన 4 గంటల్లోనే బయటకు రావాలని చెప్పారాయన. వైన్స్‌, సూపర్‌ మార్కెట్ల వద్ద ప్రజలు భారీగా గుమిగూడుతున్నారని.. అలాంటి ప్రాంతాలు కోవిడ్ కేంద్రాలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు‌.