కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన హైదరాబాద్ ప్రొఫెసర్ సీమా మిశ్రా, పరీక్షల కోసం సిద్ధం.

  • Published By: madhu ,Published On : March 29, 2020 / 07:46 AM IST
కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన హైదరాబాద్ ప్రొఫెసర్  సీమా మిశ్రా, పరీక్షల కోసం సిద్ధం.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు మందు కనిపెట్టేందుకు ఎంతో మంది ట్రై చేస్తున్నారు. కానీ సత్ఫలితాలు ఇవ్వడం లేదు. అగ్రరాజ్యం అమెరికా నుంచి నుంచి మొదలుకొని ఎన్నో దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఎవరూ సక్సెస్ కావడం లేదు. కానీ హైదరాబాద్ కు చెందిన ఓ ప్రోఫెసర్ ఇందులో సక్సెస్ సాధించారు.

యూనివర్సిటీకి ఆఫ్ హైదరాబాద్ (HCU) అధ్యాపకురాలు సీమా మిశ్రా వ్యాక్సిన్ కనిపెట్టారు. ఈ కనిపెట్టిన ఈ మందును టీ సెల్ ఎపిటోమ్ అని పేరు పెట్టారు. అయితే..దీనిపై పూర్తిస్థాయిలో అవగాహన కోసం కోసం శాస్త్రవేత్తల కమ్యూనిటీతో కలిసి చర్చలు జరపాల్సి ఉందని వర్సిటీ వెల్లడించింది. 

పూర్తి వివరాలు..
హైదరాబాద్ లోని HCU బయో కెమిస్ట్రీ విభాగంలో  సీమా మిశ్రా ప్రోఫెసర్ గా ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో దీనికి వైరస్ కనిపెట్టేందుకు అధ్యయనం చేశారు. వైరస్ కారణంగా..మనిషి శరీరంలో చెడిపోయిన కణాలను అంతం చేసేందుకు అణుమాత్రం శక్తి కలిగిన ఇతర కణాలను ఆమె సృష్టించారు. కానీ..ఇది పరిశోధనలో మాత్రమే ఉందని, దీని కారణంగా..ఆరోగ్యవంతంగా ఉన్న కణాలకు ఎలాంటి హానీ జరగదని యూనివర్సిటీ తెలిపింది. పూర్తిస్థాయిలో పరిశోధన జరిగిన తర్వాతే..ఇది అమల్లోకి వస్తుందా ? రాదా అన్నదే తెలుస్తుంది.