Telangana Government : తెలంగాణలో వ్యాక్సిన్ పాలసీ, ప్రజల్లో తిరిగే వారికి మొదటి ప్రాధాన్యత

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ప్రక్రియలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం వ్యాక్సిన్ పాలసీని సిద్ధం చేసింది. వ్యాక్సినేషన్ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Telangana Government : తెలంగాణలో వ్యాక్సిన్ పాలసీ, ప్రజల్లో తిరిగే వారికి మొదటి ప్రాధాన్యత

Telangana Govt

Vaccine Policy : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ప్రక్రియలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం వ్యాక్సిన్ పాలసీని సిద్ధం చేసింది. వ్యాక్సినేషన్ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 30 ఏళ్లు పైబడిన వారికి,  సూపర్ స్ప్రెడర్స్ కి వ్యాక్సిన్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రజల్లో తిరిగే వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తున్నారు. పాలు, కూరగాయలు, గ్యాస్ విక్రయదారులకు వర్గాలుగా విభజించి..వ్యాక్సిన్ ఇవ్వాలని ఆలోచన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

వైద్య ఆరోగ్య శాఖతో పాటు..రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ అంశంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో 2021, మే 24వ తేదీ సోమవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి హరీష్ రావుతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా వ్యాక్సినేషన్ తో పాటు కొనసాగుతున్న లాక్ డౌన్ కొనసాగింపుపై చర్చిస్తున్నారు. నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని, ఇందుకు రూ. 2 వేల 500 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావించింది.

కానీ..ప్రస్తుతం సెకండ్ డోస్ దొరకని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో..ప్రభుత్వం గ్లోబల్ టెండర్స్ లు పిలుస్తోంది. మొదటగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జనాభాకు అనుగుణంగా వ్యాక్సిన్ అందడం లేదు. అందులో భాగంగా..వ్యాక్సిన్ పాలసీని రూపొందించింది. పోలీసు విభాగంతో పాటు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ ఇవ్వాలని తాజాగా నిర్వహించిన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షల 28 వేల మందికి పైగా ఫస్ట్ డోస్, 10 లక్షల 74 వేల మందికి వ్యాక్సిన్ వేసింది. ఇప్పటి వరకు కొవిషీల్డ్, కొవాగ్జిన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్పుత్నిక్, ఫైజర్ లను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్ లను వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 30 ఏళ్ల పైబడిన వారికి, సూపర్ స్ప్రెడర్స్  కి వ్యాక్సిన్ ఇవ్వాలని, వచ్చే వారం రోజుల్లో మొదటి డోస్ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read More : Kg Mangalsutra Gift : భార్యకు కిలో బంగారు తాళి గిఫ్ట్ ఇచ్చిన భర్త..అసలు విషయం తెలిసి పోలీసులు షాక్