Warangal : ఆంత్రాక్స్‌ నివారణకు టీకాలు..వ్యాధి కట్టడిలోనే ఉంది

తమ దగ్గర ఉన్న వెయ్యి డోసులతో ప్రాథమికంగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నామని, ప్రస్తుతం ఆంత్రాక్స్ వ్యాధి వ్యాప్తి కట్టడిలోనే ఉందన్నారు.

Warangal : ఆంత్రాక్స్‌ నివారణకు టీకాలు..వ్యాధి కట్టడిలోనే ఉంది

Warangal

Vaccines For Anthrax  : వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం రేపుతోంది. టీకాలు కొరత ఉందనే తెగ ప్రచారం జరుగుతోంది. దీంతో సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి. దీనిపై 10tv వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై పశు సంవర్ధక శాఖ స్పందించింది. ఇటీవలే వరంగల్‌ జిల్లా చాపలబండ గ్రామంలోని ఆంత్రాక్స్‌ వ్యాధితో నాలుగు గొర్రెలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. దీంతో పశుసంవర్ధక అధికారులు అలర్ట్ అయ్యారు. కానీ టీకాలు లభించడం లేదనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా వీ అండ్ ఏహెచ్ ఏడీ డి. నాగమణి..10tvతో మాట్లాడారు.

Read More : Kerala : యూ ట్యూబ్ వీడియో సహాయంతో బిడ్డకు జన్మనిచ్చిన బాలిక!

తమ దగ్గర ఉన్న వెయ్యి డోసులతో ప్రాథమికంగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నామని, ప్రస్తుతం ఆంత్రాక్స్ వ్యాధి వ్యాప్తి కట్టడిలోనే ఉందన్నారు. ఆంత్రాక్స్ గుర్తించిన వెంటనే తనతో సహా పశు సంవర్ధక శాఖ అధికారులంతా చాపలబండను సందర్శించామన్నారు. ఆంత్రాక్స్ వ్యాధిని అదుపు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చాపలబండ గ్రామం సహా నాలుగు గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టినట్టు, ఆంత్రాక్స్ బారిన పడ్డ గ్రామాలను సందర్శించామన్నారు.

Read More : Toddler adjusting her crown : స్టేజీ మీద చిన్నారి సమసయస్ఫూర్తి..ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే

మొత్తం నాలుగు గ్రామాల్లో పశు వైద్య బృందాలు ఆంత్రాక్స్ కట్టడికి చర్యలు చేపట్టడం జరిగిందని, నాలుగు గ్రామాలకు కావాల్సిన ఆంత్రాక్స్ వ్యాక్సిన్ డోసుల కోసం బెంగుళూరు అధికారులతో ఉన్నతాధికారులు మాట్లాడారని, గురువారం సాయంత్రం లేదా శుక్రవారం లోగా ఆంత్రాక్స్ వ్యాక్సిన్ జిల్లాకు చేరుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంత్రాక్స్ తో భయపడాల్సిన అవసరం లేదని గ్రామ ప్రజలకు సూచించారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే రోగం అయినా… జిల్లాలో ఆ ప్రమాదం లేదన్నారు. ముందు జాగ్రత్త చర్యగా చాపలబండ సహా మందపల్లి, అడవి రంగాపూర్, తొగర్రాయి, నాచినపల్లి గ్రామాల్లోని గొర్రెలు, మేకలకు పెన్సిలిన్ టీకాలు వేస్తున్నామన్నారు. పెన్సిలిన్ తో ఆంత్రాక్స్ అదుపులోనే ఉంటుందని తెలిపారు.