Vanama Raghava : వనమా రాఘవను సస్పెండ్ చేసిన టీఆర్ఎస్ పార్టీ

ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. 

Vanama Raghava : వనమా రాఘవను సస్పెండ్ చేసిన టీఆర్ఎస్ పార్టీ

Vanama Raghavednra

Vanama Raghava :  ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు సస్పెండ్   చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర రెడ్డి, పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్ చార్జి నూకల నరేష్ రెడ్డి ప్రకటించారు. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ ఆదేశాలు జారీ చేసింది.
పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో  రాఘవ తీవ్ర ఆరోపణలు ఎదుర్కోంటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు రాఘవపై ఐపీసీ సెక్షన్ 302, 306,307 కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. రామకృష్ణ భార్యా పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న తర్వాత లభించిన సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలో వనమా రాఘవ ప్రమేయం ఉన్నట్లు తేలింది.
Also Read : Road Accident : కుక్కను తప్పించబోయి బోల్తా పడిన కారు
ఆయన పెట్టిన ఇబ్బందుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రామకృష్ణ సెల్ఫీ వీడియోలో వివరించటంతో పెనుదుమారం రేగింది. ఈ ఘటనపై ప్రతి పక్షాలు అధికార టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డాయి. దీంతో ఐదురోజుల తర్వాత పార్టీ స్పందించి రాఘవను  పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధికార ప్రకటన వెలువరించింది.