Kothagudem : అజ్ఞాతంలో వనమా రాఘవేంద్ర…ఆచూకీ కోసం 8 బృందాలు

ఏపీ, తెలంగాణలో గాలిస్తున్నామన్నారు కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్‌రాజ్. యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నా దానికి ధీటుగా కౌంటర్ ఫైల్ చేస్తామన్నారు...

Kothagudem : అజ్ఞాతంలో వనమా రాఘవేంద్ర…ఆచూకీ కోసం 8 బృందాలు

Vanama

Vanama Raghavendra Rao : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామకృష్ణ దంపతుల ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్ర ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇప్పటివరకు కూడా అతడిని పోలీసులు పట్టుకోలేదు. త్వరలోనే వనమా రాఘవేంద్రను అదుపులోకి తీసుకుంటామంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు. అతని ఆచూకీ కోసం 8 బృందాలను ఏర్పాటు చేసి.. ఏపీ, తెలంగాణలో గాలిస్తున్నామన్నారు కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్‌రాజ్. యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నా దానికి ధీటుగా కౌంటర్ ఫైల్ చేస్తామన్నారు.

Read More : Funds Sanctioned : పోలవరం నిధులు మంజూరు

మరోవైపు సీఎం కేసీఆర్‌ దృష్టికి రామకృష్ణ ఆత్మహత్య కేసును తీసుకువెళ్లారు అధికారులు. దీంతో రాఘవ నిర్వాకంపై ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్ కోరారు కేసీఆర్‌. సూసైడ్ కేసుకు సంబంధించి పూర్తి వాస్తవాలు తెలుసుకోవాలని కీలక నేతకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. ఇటు ఈ ఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. 2022, జనవరి 07వ తేదీ శుక్రవారం కొత్తగూడెం బంద్‌కు పిలుపునిచ్చింది కాంగ్రెస్‌ పార్టీ.

Read More : Amritsar Police : లూడో లవ్ స్టోరీ…యువకుడి కోసం భర్త, బిడ్డలను వదిలేసి…

వనమా రాఘవేంద్రపై గతంలోనూ కేసులు ఉన్నాయని.. అప్పుడే సరైన చర్యలు తీసుకుంటే ఫ్యామిలీ సూసైడ్ చేసుకునేంత వరకు రాదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఈ ఘటనపై సీఎం స్పందించి చర్యలు తీసుకోకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కుమారుడికి ఓ రూల్‌.. సామాన్యులకు మరో రూలా అంటూ ప్రశ్నించారు ఎంపీ కోమటిరెడ్డి.