VC Sajjanar: రోడ్డు ప్రమాదం నుంచి క్షణాల్లో తప్పించుకున్న మహిళ.. వీడియో షేర్ చేసిన వీసీ సజ్జనార్

రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అందరూ బాధ్యతగా ఉండాలి. ఈ విషయాన్ని సూచిస్తూ టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒక వీడియో షేర్ చేశారు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఆ వీడియోను మీరూ చూడండి.

VC Sajjanar: రోడ్డు ప్రమాదం నుంచి క్షణాల్లో తప్పించుకున్న మహిళ.. వీడియో షేర్ చేసిన వీసీ సజ్జనార్

VC Sajjanar: రోడ్లపై ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే వారికే కాదు.. ఇతరులకూ ప్రమాదకరమే. అందుకే అందరూ బాధ్యతగా ఉంటే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగదు. ఈ విషయంలో రవాణా శాఖ, పోలీసు శాఖ, ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉంటుంది.

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు నా రక్తం ఇచ్చాను.. కానీ, నన్ను మర్చిపోయింది: గులాంనబీ ఆజాద్

అందులోనూ రోడ్డు భద్రత విషయలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తుంటారు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. రోడ్డు భద్రతకు సంబంధించిన వీడియోలు కూడా షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెకు ఎదురుగా కొద్ది దూరంలో ఒక ఆటో ఉంటుంది. అయితే, ఆటో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు ఆటోను ఢీకొంది. దీంతో కారు, ఆటో రెండూ వేగంగా ఆమె వైపు దూసుకొస్తాయి. మామూలుగా అయితే ఈ రెండూ లేదా ఏదో ఒక వాహనం ఆమెను ఢీకొనేదే. కానీ, ఆమె క్షణాల్లో స్పందించి అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.

Rahul Gandhi: దేశాన్ని ముక్కలు చేయడమో మోదీ విధానం.. బీజేపీ, ప్రధానిపై రాహుల్ ఫైర్

రెండూ ఆమెకు అతి దగ్గరి నుంచి పక్కకు వెళ్లాయి. ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడింది. ఈ దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియోను వీసీ సజ్జనార్ షేర్ చేశారు. ‘‘అదృష్టవశాత్తు ఆమె ప్రమాదం నుంచి తప్పించుకుంది. అయితే ఎన్నిసార్లు అదృష్టం మీద ఆధారపడతారు’’ అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రోడ్లపై బాధ్యతగా ఉండాలి అని సూచించారు.