అన్నతో గొడవైతే అక్కడే పోరాడు.. వైవీ సుబ్బారెడ్డి వల్ల కాలేదు : వీహెచ్

అన్నతో గొడవైతే అక్కడే పోరాడు.. వైవీ సుబ్బారెడ్డి వల్ల కాలేదు : వీహెచ్

తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పార్టీ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం కాగా.. షర్మిల పార్టీ పెడుతున్నట్లుగా వస్తున్న వార్తలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వీ హనుమంతరావు లేటెస్ట్‌గా కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు ఆంధ్రాలో అన్యాయం జరిగితే.. తెలంగాణలో పార్టీ పెట్టడం సరికాదు అని అన్నారు హనుమంతరావు. తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల ఉపయోగం లేదని, ఇక్కడ ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కొట్లాడుకుంటున్నాయిని చెప్పుకొచ్చారు.

షర్మిలకు అన్న జగన్ అన్యాయం చేసిండు అని, జగన్ జైలులో ఉన్నప్పుడు రోడ్డు మీద తిరిగిన షర్మిలకు ఆ పార్టీలో ప్రాధాన్యత దక్కలేదని అభిప్రాయపడ్డారు వీహెచ్. విశాఖపట్నం సీటు ఇస్తానని మాట ఇచ్చి జగన్ తప్పాడని, తర్వాత రాజ్యసభ కూడా ఇవ్వలేదని.. ఇటీవలి కాలంలో కుటుంబ గొడవలు కూడా అయినట్లు చెప్పుకొచ్చారు హనుమంత రావు. కోపం ఒక దగ్గర.. పని ఒక దగ్గర నడవవు కదా? అని ప్రశ్నించారు.

అన్యాయం చేసిన అన్నతో తేల్చుకోవాలంటే…ఆంధ్రాలో ఫైట్ చెయ్యాలని తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఫైట్ చేసుకుంటున్నాయని అన్నారు. ఇక్కడ పార్టీ పెట్టడం ఉద్ధేశ్యం ఏంటో.. అన్న మీద కోపమో నాలుగు రోజులు ఆగితే తెలుస్తుంది అన్నారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి కూడా వీరి మధ్య గొడవలు సర్దుమణిగించేందుకు కృషి చేశారని తెలిసిందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలతో వెళ్లే కొంతమంది వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారో? అసలు లేరో అప్పుడే అర్థం అయ్యే పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్.. తెచ్చింది కాంగ్రెస్.. అని షర్మిల పార్టీ అసలు ఉద్ధేశ్యం ఏంటో రాబోయే కాలంలో తెలుస్తుందని అన్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డకు నేను ఇస్తున్న సలహా.. అక్కడే ఆంధ్రాలో పోరాడు.. అన్నారు.