Vice President Venkaiah Naidu : మల్లు స్వరాజ్యం మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలుగు మహిళా శక్తికి ప్రతిరూపమైన మల్లు స్వరాజ్యం పరమపదించారని తెలిసి విచారించానని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.

Vice President Venkaiah Naidu : మల్లు స్వరాజ్యం మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Venkaiah Naidu

Vice President Venkaiah Naidu : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల యావత్‌ సమాజం నివాళులర్పిస్తోంది. పలువురు ప్రముఖులు మల్లు స్వరాజ్యం పార్థీవ దేహానికి నివాళులర్పించారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు. మల్లు స్వరాజ్యం మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలుగు మహిళా శక్తికి ప్రతిరూపమైన మల్లు స్వరాజ్యం పరమపదించారని తెలిసి విచారించానని తెలిపారు.

పీడిత ప్రజల పక్షాన ఆమె చేసిన పోరాటం అనుపమానమైనదని కొనియాడారు. రెండు పర్యాయాలు శాసనసభ్యురాలిగా మల్లు స్వరాజ్యం అందించిన సేవలు మరువలేనివన్నారు. మల్లు స్వరాజ్యం, తాను ఒకే సమయంలో ఎన్నికై శాసనసభ్యులుగా కలిసి పని చేశామని తెలిపారు. మల్లు స్వరాజ్యం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

Mallu Swarajyam Passed Away : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు స్వరాజ్యం హైదరాబాద్ బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం(మార్చి 19,2022) మృతి చెందారు. 19 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. నిజాం కాలంలో రజాకార్లను ఎదురించిన ధీశాలి మల్లు స్వరాజ్యం. తుంగతుర్తి నుంచి శాసన సభకు ప్రాతినిధ్య వహించారు.

సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931లో మల్లు స్వరాజ్యం జన్మించారు. 1978, 1983లో సీపీఎం తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించారు. 1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం గారి ఇంటిని నైజాం గుండాలు తగలబడ్డాయి. మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో అదిలాబాద్ ,వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు.

Mallu Swarajyam : నల్గొండకు మల్లు స్వరాజ్యం పార్థీవదేహం.. ప్రముఖుల నివాళి

మహిళ కమాండర్ గా పని చేశారు. అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యం గారిని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. మల్లు స్వరాజ్యం భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. మల్లు స్వరాజ్యం సోదరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి.. అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుండి 83 వరకు మొదటి దఫా, రెండవ దఫా 1983 నుండి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సీపీఎం పార్టీ తరఫున పనిచేశారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు.