సాధారణ పరీక్షలకు వచ్చే వారికి కరోనా టెస్టుల ఎక్విప్ మెంట్లు వాడుతున్న విజయా డయాగ్నోస్టిక్ సెంటర్

  • Published By: bheemraj ,Published On : July 20, 2020 / 07:08 PM IST
సాధారణ పరీక్షలకు వచ్చే వారికి కరోనా టెస్టుల ఎక్విప్ మెంట్లు వాడుతున్న విజయా డయాగ్నోస్టిక్ సెంటర్

హైదరాబాద్ లోని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. తాజాగా రాజేంద్రనగర్ లోని విజయా డయాగ్నోస్టిక్ సెంటర్ వ్యవహారం బయటపడింది. ఈ ఆస్పత్రి సిబ్బంది కరోనా బాధితులకు టెస్టులు చేస్తూ కోవిడ్ పేషెంట్లకు రహస్యంగా ఇతర పరీక్షలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ దాచి పెట్టి సాధారణ పరీక్షలకు వచ్చే వారికి కూడా అవే ఎక్విప్ మెంట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇది తెలిసిన కొంతమంది వ్యక్తులు సిబ్బందిని ప్రశ్నించగా వారిపై దౌర్జన్యానికి దిగడమే కాకుండా పోలీస్ స్టేషన్ లో న్యూసెన్స్ కేసు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో విజయా డయాగ్నోస్టిక్ సిబ్బంది కరోనా పేషెంట్లను గుట్టుచప్పుడు కాకుండా బయటకు పంపించారు.

ఆస్పత్రి సిబ్బంది..
‘సెంటర్ లో కోవిడ్ టెస్టు చేయడం లేదు. సాధారణ పేషెంట్ల లాగా కరోనా పేషెంట్లు కూడా వచ్చారు. వారికి ఈసీజీ, ఎక్స్ రే ఉన్నాయి. కానీ వాళ్లు కోవిడ్ పేషెంట్లని మాకు తెలియదు. వారికి ఈసీజీ, ఎక్స్ రే చేసిన తర్వాత గత హిస్టరీ అడినప్పుడు కోవిడ్ వచ్చి వెళ్లిపోయిందని ఇప్పుడు నెగెటివ్ అని చెప్పారు. కొద్దిగా అసాధారణం అని స్వాప్స్ క్లీన్ చేశాము.

కొంతమంది బయటి నిలబడి వచ్చే పేషెంట్లకు ఇక్కడ కోవిడ్ స్వాప్స్ సేకరిస్తున్నారని చెబుతున్నారు. అసలు ఇక్కడ కోవిడ్ శాంపిల్స్ జరుగడం లేదు. కరోనా పేషెంట్లు ఎవరూ లేరు. వచ్చే పేషెంట్లకు ఇబ్బంది కలుగకుండా బయట ఎవరో మిస్ బిహేవ్ చేస్తున్నందుకు మేము పోలీసులను పిలిచాము’ అని తెలిపారు.