Vijayashanti: ప్రభుత్వం మారితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది-విజయశాంతి

డ్రగ్స్ కల్చర్ వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే అని విజయశాంతి(Vijayashanti On TRS) ఆరోపించారు. రాష్ట్రంలో మార్పు అవసరమని తేల్చి చెప్పారు.

Vijayashanti: ప్రభుత్వం మారితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది-విజయశాంతి

Vijayashanti On Trs

Vijayashanti On TRS : పటాన్ చెరులోని బీరంగూడ గుట్టపై జరిగిన అంతర్జాతీయ మహిళ దినోత్సవ కార్యక్రమంలో బీజేపీ నేత విజయశాంతి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ను తుంగలో తొక్కాలని విజయశాంతి పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం మారితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్నారు.

Telangana Politics : తెలంగాణపై ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్?

మహిళలు.. ఒక్కొక్కరు మిస్సైల్ లాంటి వారని ఆమె అన్నారు. మహిళలు కోరుకునేది సమాజంలో గౌరవం అని చెప్పారు. మహిళ అంటే భాధ్యత, బాధ్యత అంటే మహిళ అని అన్నారు. సభ్యత, సంస్కారం నేర్పించేది మహిళ అని చెప్పారు. సమాజంలో డ్రగ్స్ కి బానిసై యువత… తల్లి, చెల్లి అనే బేధం లేకుండా మానభంగాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కల్చర్ వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే అని ఆమె ఆరోపించారు.(Vijayashanti On TRS)

Telangana : ఎవరితో పొత్తు లేకుండా గెలుస్తాం.. అధికారంలోకి రావడమే లక్ష్యం

మద్యానికి బానిసలుగా మారి అడబిడ్డలను మానభంగాలు, హత్యలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి కావాలా? అని ఆమె అడిగారు. లవ్ జిహాద్ కొత్తగా వచ్చిందన్న విజయశాంతి.. రాష్ట్రంలో భద్రత లేక మహిళలు భయంతో బతుకుతున్నారని వాపోయారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదన్నారు. యూపీలో భద్రత లేని చోట ప్రధాని మోదీ, సీఎం యోగి భద్రత కల్పించారని విజయశాంతి చెప్పారు. ఉత్తరప్రదేశ్.. ఇప్పుడు మాఫియా చేతుల్లో లేదని, యోగి ప్రభుత్వం చేతుల్లో ఉందని చెప్పారు. యూపీలో బీజేపీ వరుసగా రెండోసారి గెలిచిందంటే మంచి పనులు చేయడం వల్లే అని విజయశాంతి చెప్పారు.

Raja Singh On Election Results : తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం వస్తుంది-రాజాసింగ్

అపవిత్రంగా ఉన్న రాష్ట్రాన్ని యోగి ప్రభుత్వం కడిగి పవిత్రం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ప్రభుత్వం లేదన్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు విజయశాంతి. తప్పులు చేసిన ప్రభుత్వం పాతాళంలోకి పోతుందన్నారు. ఉద్యోగాలు ఇస్తానని సీఎం కేసీఆర్ దొంగ మాటలు చెబుతున్నారని ఆరోపించారు. బీజేపీ.. నాలుగు రాష్ట్రాలు గెలిచిందనే భయంతో కేసీఆర్ ఆసుపత్రిలో పడుకున్నారని అన్నారు. ముందు ప్రజలు మారాలని విజయశాంతి అన్నారు. ఇలాంటి సీఎం మనకు అవసరం లేదన్నారు విజయశాంతి.(Vijayashanti On TRS)

AAP Telangana : ఫుల్ జోష్‌‌లో ఆప్.. తెలంగాణపై ఫోకస్, త్వరలో పాదయాత్రలు

సీఎం కేసీఆర్ రూ.2 వేలు, రూ.3 వేలు ఇచ్చి మాయ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మీ చేతుల్లోనే ఉందన్నారు. మీకు చెప్పడం మా డ్యూటీ అన్న విజయశాంతి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం మీ డ్యూటీ అన్నారు. రాష్ట్రంలో మార్పు అవసరమని ఆమె తేల్చి చెప్పారు. ఆ నాలుగు రాష్ట్రాల్లో మహిళలు, యువత ఓట్లతోనే బీజేపీ గెలుపు సాధ్యమైందన్నారు. మగవాళ్లు మహిళలను గౌరవించాలని, ఇంట్లో వారినే కాదు సమాజంలోని మహిళలను కూడా గౌరవంగా చూడాలన్నారు.

GVL On Elections : బీజేపీ నెక్ట్స్ టార్గెట్.. తెలుగు రాష్ట్రాలే-జీవీఎల్

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. నాలుగు చోట్ల ఘన విజయం సాధించింది. ఈ గెలుపు బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ఈ గెలుపు తర్వాత మిగతా రాష్ట్రాలపై బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. అందులో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణ బీజేపీ నేతలు దూకుడు పెంచారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరింతగా టార్గెట్ చేశారు. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.