దీపిక కిడ్నాప్ కేసులో ట్విస్ట్ లు ఎన్నో ….?

  • Published By: murthy ,Published On : September 28, 2020 / 04:54 PM IST
దీపిక కిడ్నాప్ కేసులో ట్విస్ట్ లు ఎన్నో ….?

vikarabad deepika kidnap case:వికారాబాద్ లో కిడ్నాప్ కుగురైన దీపిక కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు తన కొడుక్కి పెళ్లైన విషయమే తెలియదన్నారు అఖిల్ తండ్రి. అఖిల్ దీపిక లు విడాకుల విషయమై శనివారం ఇరువురూ కోర్టుకు హజరయ్యారు. అదే రోజు సాయంత్రం దీపిక కిడ్నాప్ కు గురయ్యింది.

అఖిల్, దీపిక లు 2016 లో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. దీపిక తల్లి తండ్రులకు తమ కుమార్తె అఖిల్ ను పెళ్లి చేసుకోవటం ఇష్టంలేదు. రెండు సంవత్సరాలు క్రితం కూతురుని తమ ఇంటికి తెచ్చుకున్నారు. కుటుంబ సభ్యుల బలవంతంతో దీపిక అఖిల్ నుంచి విడాకులు కోరుతూ వికారాబాద్ ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఆ క్రమంలో ఇరువురూ శనివారం వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు.



అదే రోజు సాయంత్రం తన సోదరితో కలిసి షాపింగ్ కు వెళ్లి..ఇంటికి తిరిగి వెళుతుండంగా ఓ కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆమె సోదరికి పక్కకు నెట్టి వేసి…. దీపికను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఈ విషయమై ఆమె కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డీఎస్పీ సంజీవరావు తమ సిబ్బందితో వెళ్లి సంఘటన స్ధలంతో పరిశీలించారు. దీపికను ఆమె భర్త అఖిలే కిడ్నాప్‌ చేశాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దీపిక ఆచూకీ ఇంతవరకు లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.



ఇక …..అఖిల్ తండ్రి తన కుమారుడికి పెళ్లైన సంగతే తెలియదన్నారు. శనివారం సాయంత్రం పోలీసులు తన ఇంటికి వచ్చిన తర్వాతే తెలిసిందన్నారు. అప్పటి నుంచి అఖిల్‌కు ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా….. స్విచ్‌ ఆఫ్‌ వస్తోందని ఆయన తెలిపారు.

గతంలో తన కొడుకు ఒకసారి …..తన స్నేహితుడికి కోర్టులో కనిపించాడని తెలిసి అడిగ్గా…..సరిగ్గా సమాధానం చెప్పలేదని వివరించారు.ప్రస్తుతం అఖిల్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ సంస్దలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడని….. వారాంతంలో ఎప్పుడో ఒక్కసారి ఇంటికి వచ్చి వెళ్తుంటాడని ఆయన తెలిపారు.



గత శనివారం కూడా అదే విధంగా వచ్చి వెళ్లాడని చెప్పారు. ఇంతలోనే నిన్న సాయంత్రం ఇంటికి పోలీసులు వచ్చి ఓ యువతిని తన కుమారుడు కిడ్నాప్ చేశాడని చెప్పడంతో షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు.

అయితే దీపిక గురించి పూర్తి వివరాలు వెల్లడించడానికి పోలీసులు, కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. వికారాబాద్‌ సీఐ గురుకుల రాజశేఖర్‌ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి వెళ్లి కిడ్నాప్‌పై స్థానికులను విచారించారు.



అనంతరం సీసీ పుటేజీ ద్వారా కారు గురించి ఆరా తీశారు. కారు హైదరాబాద్‌ వైపు వెళ్లిన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇక ఈ కిడ్నాప్‌ కేసు చివరికి ఎటువైపు మలుపు తిరుగుతుందో వేచిచూడాలి.