Vinod Kumar: రేవంత్ రెడ్డి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు: వినోద్ కుమార్

కేటీఆర్ పీఏ ఊర్లో 100 మంది టీఎస్పీఎస్సీ పరీక్షల్లో పాసయ్యారని అంటున్నారని, సిట్ అధికారులు నోటీసు ఇస్తే రేవంత్, సంజయ్ స్పందించడం లేదని తెలిపారు. టీఎస్పీఎస్సీ లీకేజ్ విషయంలో వివరాలు తమకు తెలుసని రేవంత్, బండి సంజయ్ అన్నారని, వివరాలు ఇమ్మంటే పారిపోయారని చెప్పారు.

Vinod Kumar: రేవంత్ రెడ్డి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు: వినోద్ కుమార్

Vinod Kumar

Vinod Kumar: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మండిపడ్డారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ…రేవంత్ రెడ్డి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. కేటీఆర్ పీఏ ఊర్లో 100 మంది పాసయ్యారని అంటున్నారని, సిట్ అధికారులు నోటీసు ఇస్తే రేవంత్, సంజయ్ స్పందించడం లేదని తెలిపారు.

లీకేజీ వివరాలు తమకు తెలుసని రేవంత్, బండి సంజయ్ అన్నారని, వివరాలు ఇమ్మంటే పారిపోయారని చెప్పారు. సిట్ విచారణకు రమ్మంటే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో అభివృద్ధిని కాదనలేవని అన్నారు.

అయినా బీజేపీ, కాంగ్రెస్ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. పేపర్ లీకేజీ ఘటన దురదృష్టకరమని అన్నారు. తాను తమ పార్టీ ఏర్పాటు సమయం నుంచి ఇప్పటి వరకు విధేయుడిగా ఉన్నానని తెలిపారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని చెప్పారు. 119కి స్థానాలకు గాను 100 స్థానాల్లో బీఆర్ఎస్ గెలవాలని అన్నారు.

Minister KTR : 70ఏళ్లలో జరగని పనులు 7ఏళ్లలో జరిగాయి-కేటీఆర్