లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘన…హైదరాబాద్ కంటైన్మెంట్, రెడ్ జోన్లలో జోరుగా మద్యం అమ్మకాలు

  • Published By: srihari ,Published On : May 16, 2020 / 01:12 PM IST
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘన…హైదరాబాద్ కంటైన్మెంట్, రెడ్ జోన్లలో జోరుగా మద్యం అమ్మకాలు

హైదరాబాద్ లోని కంటైన్మెంట్, రెడ్ జోన్లలో మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు పట్టించుకోకుండా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. వైన్ షాప్ యజమానులు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించారు.   కార్వాన్ కంటైన్ మెంట్ జోన్ లో వైన్ షాపులు తెరిచారు. లాక్ డౌన్ పట్టించుకోకుండా వైన్ షాపుల యజమానులు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.

అబ్కారీ అధికారులే అనుమతి ఇచ్చారని వైన్ షాపుల ఓనర్స్ అంటున్నారు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సీఎం ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. మద్యం దుకాణాల యజమానులు సీఎం కేసీఆర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదు.  

కరోనా భయపెడుతున్నా కొంతమంది నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 1454 కరోనా కేసులుంటే కేవలం హైదరాబాద్ లోని నాలుగు జోన్లలోనే వెయ్యికి పైగా కేసులు నమోదు అయ్యాయి. ఎల్ బీనగర్, మలక్ పేట్, చార్మినార్, కార్వాన్..ఈ నాలుగు జోన్లలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.   

రెడ్ జోన్ గా ప్రకటించిన కార్వాన్ లో భవాని వైన్ షాప్, సమ్మక్క సారక్క వైన్ షాపులు యదేచ్చగా మద్యం అమ్మకాలను కొనగిస్తున్నాయి. అబ్కారీ శాఖ అధికారులు తమను మూసివేయాలని చెప్పలేదని వైన్ షాప్ నిర్వహకులు చెబుతున్నారు. తాము బందోబస్తులో ఉన్నామని..వైన్ షాపుకు తమకు ఎలాంటి సంబంధం లేదని అక్కడున్న పోలీసులు చెబుతున్నారు. 

ఏకంగా కంటైన్ మెంట్ జోన్ గేట్ కు ఆనుకుని రెండు వైన్ షాపులు యదేచ్చగా మద్యం అమ్మకాలను కొనసాగిస్తున్నాయి. ఇక్కడ ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రశ్నించడం లేదు. స్థానిక పోలీసులు మూసివేయడం లేదు. మద్యం షాపులను ఎందుకు మూసివేయడం లేదని జనం ప్రశ్నిస్తున్నారు. 

కార్వాన్ జోన్ లో విపరీతమైన కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు రెండు వైన్ షాపులు యథేచ్చగా మద్యం అమ్మకాలను కొనసాగిస్తున్నాయి. దీనికి ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అధికారులు, ఉన్నతాధికారులు ఏ విధమైన సమాధానం చెబుతారో చూడాల్సివుంది.