TikTok ఖతర్‌ పాపకు సినిమా ఛాన్స్..ఎక్స్ పోజింగ్ చేయనంటున్న బూతుల బుజ్జి

TikTok  ఖతర్‌ పాపకు సినిమా ఛాన్స్..ఎక్స్ పోజింగ్ చేయనంటున్న బూతుల బుజ్జి

Tik Tok  Qatar Papa

tik tok  qatar papa alias shalini  movies Chance : tiktok యాప్. ఈ యాప్ తో ఎంతోమంది ఫేమస్ అయిపోయారు. ఈ యాప్ లో వారి ప్రావీణ్యం అంతా చూపించేశారు. చూపించేస్తున్నారు. tiktok యాప్ తో తమ హవాను చూపించేస్తున్న ఎంతోమంది ‘ఠాలెంట్’లను భరించాల్సి వస్తోంది. సారీ..సారీ చూడాల్సి వస్తోంది. అలా tiktokతో ఫేమస్ అయిపోయిన బండబూతుల పాపం ఖతర్‌ పాపకు సినిమా ఛాన్స్ వచ్చింది. కత్తర్‌ పాప అలియాస్‌ షాలిని బుజ్జి. కానీ అందరిదీ ఒక రూటైతే ఈమెది మాత్రం సెపరేట్‌ రూట్‌. ఆ సెపరేట్ రూట్ ఏంటీ అంటూ అందరిలా నేనూ చేస్తే డిఫరెంట్ ఏంటీ అనుకుందీ ఖత్తర్ పాప. అమాయకంగా మాట్లాడుతూనే మరో పక్క బండబూతులు పురాటంతో ఫేమస్ అయిపోయింది. కొందరు ఆమెను కావాలని రెచ్చగొట్టి పచ్చిబూతులు మాట్లాడేలా చేసేవారు. ఆ వీడియోలను పని గట్టుకుని మరీ వైరల్‌ చేసిపారేశారు. దీంతో ఇదేదో బాగుంటే అనుకున్న ఖత్తర పాప ఆ బూతుల్నే కంటిన్యూ చేసేసింది ఖాతర్ పాప అలియాస్ షాలిని బుజ్జి.

దీనిపై పాపం ఈ బూతుల బుజ్జి ఏమంటోందంటే.. తనను కావాలనే ఇలా బూతులు మాట్లాడేలా చేశారంటోంది. అంతేకాదు ఇకనుంచి నేను బూతులు మాట్లాడనని చెప్తోంది. తనకు సినిమా ఛాన్స్‌ వచ్చిందని ఎగిరి గంతేస్తోందీ బుజ్జి. దీని గురిచి బూతుల బుజ్జి మాట్లాడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. “ఆంధ్రా పాప లేదు, ఖతర్‌‌ పాప లేదు, తొక్క పాప లేదు.. నా పేరు షాలినీ బుజ్జి. నాకు సినిమాలో ఛాన్స్ వచ్చింది. అగ్రిమెంట్‌ మీద సంతకం కూడా చేశాను. రెండు ఐటమ్‌ సాంగ్స్‌ కూడా ఇచ్చారని చెప్పేస్తోంది. ఈ సినిమాలతో నాకు మంచి పేరు వచ్చేస్తుంది. నేను చాలా మారిపోతాను ఫ్రెండ్స్‌.. ఇక నుంచి బూతులు మాట్లడను..తిట్టను, ఎక్స్‌పోజింగ్‌ వీడియోలు అస్సలే చేయను. నేనేంటో మీ అందరికీ చూపిస్తాను. నా ‘ఠాలెంట్ ’ ఏంటో చూపిస్తానంటోంది. దీంతో నన్నెవరు తిట్టుకున్నా, కుళ్లుకున్నా..కుళ్లి చచ్చిపోయినా పట్టించుకోవద్దని దర్శకులు, నిర్మాతలు నాతో చెప్పారని చెబుతోందీ బుజ్జి. నేను చాలా చాలా లక్ అబ్బా..అని తెగ మురిసిపోతోంది.

పనిలో పనిగా తాను నటించబోయే సినిమాలో డైలాగ్‌ కూడా చెప్పేసిందీ బూతుల బుజ్జి అదేనండీ షాలిని బుజ్జి. ఆ డైలాగ్ కూడా మాంచి ఫ్లోలో చెప్పేసింది. అదేమంటే..’నా హైటూ వెయిటూ చూసి ముందుకు రాకు.. నన్ను కాటేస్తే..’ అంటూ మధ్యలోనే డైలాగ్‌ ఆపి మిగతాది సినిమాలో చూడండి అని తెగ సిగ్గు మొగ్గలైపోయింది బూతుల బుజ్జి..ఇంతకీ ఆమె చేస్తుంది ఏం సినిమా? ఎవరితో? ఎప్పుడు? డైరెక్ట్‌ ఎవరు? అన్న వివరాలైతే ఏమీ చెప్పనేలేదు. మరి ఇదికూడా ఫేమస్ కోసమే చెప్పిందా? లేక నిజమా? అనేది తెలియాలి.