VP Sajjanar: ఆర్టీసీ బస్సులో గణేశ్ నిమజ్జనానికి బయల్దేరిన సజ్జనార్

వేల సంఖ్యలో భారీ జనసందోహంతో ఊరేగింపుగా బయల్దేరిన గణేశుడు నిమజ్జనం పూర్తి చేసుకున్నాడు. అదే రోజున ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌...

VP Sajjanar: ఆర్టీసీ బస్సులో గణేశ్ నిమజ్జనానికి బయల్దేరిన సజ్జనార్

Vp Sajjanar

VP Sajjanar: వేల సంఖ్యలో భారీ జనసందోహంతో ఊరేగింపుగా బయల్దేరిన గణేశుడు నిమజ్జనం పూర్తి చేసుకున్నాడు. అదే రోజున తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సమితి (ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్‌ తాము ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహానికి నిమజ్జనం చేసేందుకు బయల్దేరారు. తన ప్రత్యేకతను, చేస్తున్న డ్యూటీని ప్రతిబింబించేలా ఆర్టీసీ బస్సులో బయల్దేరడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కుటుంబసభ్యులతో కలిసి సజ్జనార్‌ వినాయకుడి ప్రతిమను తీసుకుని బస్సులో తెలుపు దుస్తులు ధరించి తలపై టోపీ పెట్టుకుని మహారాష్ట్ర లుక్‌లో కనిపించారు. బస్సు నిండా భక్తులు నినాదాలు చేస్తుండగా ఉత్సాహంగా డ్యాన్స్‌లు కూడా చేస్తూ ప్రయాణం కొనసాగించారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సంస్థ బాగు కోసం సజ్జనార్‌ చేస్తున్న ప్రయత్నాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని నెటిజన్లు అభినందిస్తున్నారు.

సజ్జనార్‌ నేతృత్వంలో ఆర్టీసీకి పూర్వ వైభవం వచ్చి లాభాల బాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం పూర్తయింది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన నాలుగో నంబర్‌ క్రేన్‌ ద్వారా మహా గణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. చివరి రోజు మహాగణపతి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. ట్యాంక్‌బండ్‌పై తుదిపూజల అనంతరం మహాగణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తిచేశారు.

Read Also: దళిత నేతను వరించిన పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవి

భాగ్యనగరంలో పెద్ద ఎత్తున గణేశుడి నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో వర్షంలోనే గణనాథులు ఊరేగింపు జరిగింది.