Janagama : వీఆర్ఏ కుటుంబం కుల బహిష్కరణ..పెట్రోల్ బాటిళ్లతో రోడ్డుపై బైఠాయించి నిరసన

జనగామ జిల్లా దేవరుప్పులలో హైటెన్షన్‌ నెలకొంది. తమను కులం నుంచి బహిష్కరించడాన్ని నిరసిస్తూ.. దేవరుప్పుల వీఆర్‌ఏ కుటుంబం రోడ్డెక్కింది. బతుకమ్మ ఆడే సమయంలోనూ అవమానపరిచారని వాపోయింది.

Janagama : వీఆర్ఏ కుటుంబం కుల బహిష్కరణ..పెట్రోల్ బాటిళ్లతో రోడ్డుపై బైఠాయించి నిరసన

Protest

VRA family protest with petrol bottles : జనగామ జిల్లా దేవరుప్పులలో హైటెన్షన్‌ నెలకొంది. తమను కులం నుంచి బహిష్కరించడాన్ని నిరసిస్తూ.. దేవరుప్పుల వీఆర్‌ఏ కుటుంబం రోడ్డెక్కింది. తమను కులం నుంచి వెలివేశారని.. బతుకమ్మ ఆడే సమయంలోనూ తమను అవమానపరిచారంటూ వీఆర్‌ఏ అబ్బయ్య కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్బయ్య కుటుంబానికి వీఆర్‌ఏ పదవి రావడంతో.. కులానికి మూడు లక్షల రూపాయలు కట్టాలంటూ కులపెద్దలు డిమాండ్‌ చేశారు.

అంత డబ్బులు కట్టలేమని చెప్పడంతో.. తమను ఇబ్బంది పెడుతున్నారని అబ్బయ్య కుటుంబం వాపోతోంది. తమపై కక్ష కట్టినట్లు ప్రవర్తిస్తున్నారని.. దీనిపై న్యాయం చేయాలంటూ.. పెట్రోల్‌ బాటిళ్లతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అబ్బయ్య కుటుంబానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మాట వినకపోవడంతో ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

Rain : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

బతుకమ్మ పండుగ సందర్భంగా కూడా.. అబ్బయ్య కుటుంబ సభ్యులను మహిళలు, కులపెద్దలు వేరు చేసి చూశారు. దీంతో డబ్బులు కట్టలేదనే కోపంతోనే తమను ఇబ్బంది పెడుతున్నారని అబ్బయ్య కుటుంబ సభ్యులు వాపోతున్నారు. బతుకమ్మలు తీసుకుని వెళ్తే అవమానిస్తున్నారని చెప్పారు. వారితో కలిసి బతుకమ్మలు పెట్టనివ్వడంలేదన్నారు. బతుకమ్మను తీసుకెళ్లి కులం, పాలివాళ్లుల్లో పెడితే వేరు చేసి, తనను ఒంటిరి చేశారని పేర్కొన్నారు. బోనాల కూడా అలాగే అవమానిస్తున్నారని వాపోయారు. ప్రతి విషయంలోనూ తన కుటుంబాన్ని చిన్నతనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కమిటీ హాల్ దగ్గర తాను మాట్లాడుతుంటే అడ్డు తగిలి మాట్లాడటానికి అధికారం లేదంటున్నారని పేర్కొన్నారు. కులం నుంచి వెలి వేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. దీంతో పిల్లలు, తనకు చిన్నతనంగా ఉందని బాధ పడ్డారు. తన పాలివాళ్లు, కులం వారు ఒక్కటయ్యారని పేర్కొన్నారు. తన కొడుకు, కూతురిని కొట్టేందుకు వచ్చారని తల్లి తెలిపారు.