VVS Laxman: బీజేపీలోకి వీవీఎస్ లక్ష్మణ్..!

టీమిండియా మాజీ క్రికెటర్ VVS లక్ష్మణ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యాడా.. అందుకే బీజేపీ జాతీయ నేతలతో చర్చల్లో ఉంటున్నారా.. అని పలు సందేహాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

VVS Laxman: బీజేపీలోకి వీవీఎస్ లక్ష్మణ్..!

vvs laxman

VVS Laxman: టీమిండియా మాజీ క్రికెటర్ VVS లక్ష్మణ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యాడా.. అందుకే బీజేపీ జాతీయ నేతలతో చర్చల్లో ఉంటున్నారా.. అని పలు సందేహాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిప్పు లేనిదే పొగరాదన్నట్లు.. తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం పావులు కదుపుతున్న బీజేపీ ఈ తరహా నిర్ణయం తీసుకుందనుకోవడంలో నో డౌట్.

క్రికెట్ ఫ్యాన్స్ అంతా అభిమానించే లక్ష్మణ్ ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది. ఎన్నికల ముందు సెలబ్రిటీలను పార్టీలోకి చేర్చుకుని అటెన్షన్ గ్రాబ్ చేసుకోవడం పొలిటికల్ పార్టీల టెక్నిక్. ఈ క్రమంలోనే GHMC పరిధిలోని ఒక నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ ను ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ ప్రకటన అధికారికంగా రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లక్ష్మణ్ బీజేపీ కండువా కప్పుకుని.. విషయాన్ని వెల్లడిస్తారు.

…………………………………. : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ..?!

అక్టోబర్ 12, 2012లో లక్ష్మణ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత ఐపీఎల్ ఫ్రాంఛైజీ డెక్కన్ ఛార్జర్స్ కు కెప్టెన్ గా వ్యవహరించారు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్ గా ఉన్నారు. ఇదే సమయంలో ఓ స్పోర్ట్స్ ఛానల్ కు కామెంటేటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.