Wanaparthy: తల్లిని చంపి సంపులో పడేసిన కొడుకు, అతడి భార్య.. నిందితులపై గ్రామస్థుల దాడి
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకులలో దారుణ ఘటన జరిగింది. సంపులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Alabama shooting
Wanaparthy: మానవత్వం మంటగలిసింది. తనను కని, పెంచి కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లిని చంపాడు ఓ పుత్రరత్నం. అందుకు అతడికి భార్య సహకరించింది. చంపిన తర్వాత ఆమె మృతదేహాన్ని సంపులో పడేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న గ్రామస్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితులపై వారు దాడి చేశారు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకులలో చోటుచేసుకుంది.
సంపులో శంకరమ్మ (60) అనే మహిళ విగత జీవితా స్థానికులకు కనపడింది. ఆమె మృతి చెందిందని తెలుసుకున్న గ్రామస్థులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ వివాదంలో శంకరమ్మపై ఆగ్రహంతో ఊగిపోయి ఆమెపై కొడుకు, కోడలు దాడి చేశారు.
తీవ్రగాయాలు కావడంతో శంకరమ్మ ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె మృతదేహాన్ని సంపులో పడేశారు. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు శంకరమ్మ కొడుకు, కోడలిపై దాడి చేశారు. వారిద్దరినీ పోలీసులకు పట్టించారు. శంకరమ్మ హత్య కేసు నుంచి తప్పించుకోవడానికే నిందితులు ఇద్దరు ఆమెను సంపులో పడేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.