Munugode : మునుగోడు పాలిటిక్స్, ఎవరి జోలికి వెళ్లలేదు..ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా

మునుగోడు పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి జగదీశ్‌ రెడ్డి వర్సెస్‌ కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్‌ మద్య యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఇప్పటికే నువ్వా - నేనా అన్నట్లు సాగుతున్న మంత్రి, కోమటిరెడ్డి బద్రర్స్‌ వార్‌... చివరికి అరెస్టుల వరకు చేరుకుంది.

10TV Telugu News

Jagadish Reddy And Komatireddy Brothers : మునుగోడు పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి జగదీశ్‌ రెడ్డి వర్సెస్‌ కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్‌ మద్య యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఇప్పటికే నువ్వా – నేనా అన్నట్లు సాగుతున్న మంత్రి, కోమటిరెడ్డి బద్రర్స్‌ వార్‌… చివరికి అరెస్టుల వరకు చేరుకుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అరెస్ట్‌ను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More : Vizag : ఉక్కుపోరాటం, వెనక్కి తగ్గని కేంద్రం..అడ్డుకుంటామంటున్న కమిటీ

మాటల తూటాలు : –
సీఎం కేసీఆర్‌ పేరు చెప్పుకుని మంత్రి జగదీశ్‌రెడ్డి వేల కోట్లు దండుకున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్‌కు పట్టిన గతే త్వరలో జగదీశ్‌రెడ్డికి పడుతుందన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. అయితే.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్‌ అటాక్‌ మొదలెట్టారు మంత్రి జగదీశ్‌రెడ్డి. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై నిప్పులు చెరిగారు. కృష్ణా నదిలో నల్గొండ నీళ్ల వాటాలను అమ్ముకుని డబ్బులు సంపాదించారంటూ అన్నదమ్ములపై ఫైరయ్యారు మంత్రి. తాము కాంగ్రెస్‌ నాయకుల కాదని.. జానారెడ్డి, ఉత్తమ్‌రెడ్డి వాల్ల నోటికి భయపడేది లేదన్నారు. తాను ఇంతవరకూ ఎవరి జోలికి వెళ్లలేదని.. ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి జగదీశ్‌రెడ్డి.

Read More : Tokyo : ఒలింపిక్స్‌‌లో భారత్ పాల్గొనే మ్యాచ్‌‌ల వివరాలు

రేషన్ కార్డుల పంపిణీ : –
రేషన్‌కార్డుల పంపిణీ.. మునుగోడులో హీట్‌ పెంచేస్తోంది. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న మంత్రి జగదీశ్‌ రెడ్డి కాన్వాయ్‌ను మునుగోడు చౌరస్తాలో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చేసుకుంది. అటు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read More : Tokyo Olympics Slaps : షాకింగ్.. అంతా చూస్తుండగానే, మహిళా అథ్లెట్ చెంప పగలగొట్టిన కోచ్

పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి : –
ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని అవుటర్‌ రింగ్‌ రోడ్డు దాటిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఓ వైపు రాష్ట్రంలో హుజురాబాద్ బై పోల్ హీట్‌ కొనసాగుతున్న సమయంలో… మునుగోడు పాలిటిక్స్ మరింత హాట్‌గా మారాయి. మంత్రి వర్సస్‌ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది.

10TV Telugu News