హైదరాబాద్ తర్వాత.. తెలంగాణలో రెండో ఐటీ సిటీగా వరంగల్

వరంగల్‌ ఇక ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కేంద్రంగా మారిపోనుంది. హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో రెండో ఐటీ నగరంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ ఐటీ కంపెనీలైన టెక్‌ మహీంద్రా,

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 01:20 AM IST
హైదరాబాద్ తర్వాత.. తెలంగాణలో రెండో ఐటీ సిటీగా వరంగల్

వరంగల్‌ ఇక ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కేంద్రంగా మారిపోనుంది. హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో రెండో ఐటీ నగరంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ ఐటీ కంపెనీలైన టెక్‌ మహీంద్రా,

వరంగల్‌ ఇక ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కేంద్రంగా మారిపోనుంది. హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో రెండో ఐటీ నగరంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ ఐటీ కంపెనీలైన టెక్‌ మహీంద్రా, సైయెంట్‌ సంస్థలు తమ కేంద్రాలను వరంగల్‌లో ప్రారంభించేందుకు రెడీ అయ్యాయి. మంత్రి కేటీఆర్‌ ఇవాళ(జనవరి 7,2020) ఈ కంపెనీలను ప్రారంభించనున్నారు.

తెలంగాణలో ఐటీ పరిశ్రమ ఇతర జిల్లాల్లోకి కూడా విస్తరిస్తోంది. వరంగల్‌ను ఐటీ సిటీగా మార్చేందుకు తీసుకున్న చర్యలు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇవాళ(జనవరి 7,2020) టెక్‌ మహీంద్రా, సైయంట్‌ కంపెనీలు ఐటీ మినిస్టర్‌ కేటీఆర్‌ చేతుల మీదుగ లాంచనంగా ప్రారంభమవుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి 130 కిలో మీటర్ల దూరంలోనే ఉండడం.. గంటన్నర రెండు గంటల్లోనే హైదరాబాద్‌ చేరుకునే అవకాశం ఉండడంతో వరంగల్‌ మరో ఐటీ నగరంగా అభివృద్ధి చెందుతుందంటున్నారు. 

వరంగల్‌ శివార్లలోని మడికొండలో నెలకొల్పిన ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో.. సైయెంట్‌, టెక్‌ మహీంద్రా సంస్థలు క్యాంపస్‌లు నిర్మించాయి. వరంగల్‌ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇది ప్రారంభం మాత్రమేనని, మున్ముందు మరిన్ని అవకాశాలుంటాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వరంగల్‌ ఐటీ సెజ్‌లో TSIIC ఇంక్యుబేషన్‌ కేంద్రాన్ని 2016 ఫిబ్రవరిలో కేటీఆర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా సైయెంట్‌ ప్రాంగణ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ కంపెనీ అయిదు ఎకరాల్లో కొత్త క్యాంపస్‌ను నిర్మించింది.   

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సైయెంట్‌ ఇప్పటికే వరంగల్‌లో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను నడుపుతోంది. ప్రస్తుతం ఈ సెంటర్‌లో 200 మంది వరకు సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. విస్తరణలో భాగంగా ఐదెకరాల విస్తీర్ణంలో సైయెంట్‌ సొంతంగా టెక్నాలజీ డెవలప్ మెంట్‌ సెంటర్‌ను సిద్ధం చేసుకుంది. ఈ టెక్నాలజీ సెంటర్‌ ద్వారా అదనంగా మరో 600 నుంచి 800 మందికి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని కంపనీ చెబుతోంది. ఇప్పటివరకు సైయెంట్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రంగా ఉన్న భవనాన్ని టెక్‌ మహీంద్రాకు అప్పగించారు. టెక్‌ మహీంద్రా ద్వారా 200 మంది సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

* ఐటీ సిటీగా వరంగల్‌
* టెక్‌ మహీంద్రా, సైయంట్‌ కంపెనీలు రెడీ
* మున్ముందు మరిన్ని అవకాశాలు- కేటీఆర్‌ 
* 2016 ఫిబ్రవరిలో ఇంక్యుబేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించిన కేటీఆర్‌ 
* సైయంట్ 5 ఎకరాల్లో కొత్త క్యాంపస్‌
* ప్రస్తుతం 200 మంది సాంకేతిక నిపుణులు 
* మరో 600 నుంచి 800 మందికి ఉపాధి అవకాశాలు 
* టెక్‌ మహీంద్రా ద్వారా 200 మందికి ఉద్యోగావకాశాలు 

Also Read : ఏపీ రాజధాని ఎక్కడ? హైపవర్ కమిటీ తొలి సమావేశం