వరంగల్ MGMలో అరాచకాలు..700 ఆక్సిజన్ ఫ్లో మీటర్లు మాయం చేసిన సిబ్బంది..

ఓ పక్క కరోనాతో ప్రాణాలు పోతుంటో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో సిబ్బంది అరాచకాలు సాగిస్తున్నారు. హాస్పిటల్ లో రోగుల నుంచి భారీగా డబ్బులు గుంజేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో పోరాడుతుంటే దాన్ని అదనుగా భావించి సిబ్బంది అరాచకాలకు పాల్పడుతున్నారు. రోగులనుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అలా 700ల ఆక్సిజన్ ఫ్లో మీటర్లను దొంగిలించి మరోచోట అమ్ముకుంటున్న వైనం బయటపడింది.

వరంగల్ MGMలో అరాచకాలు..700 ఆక్సిజన్ ఫ్లో మీటర్లు మాయం చేసిన సిబ్బంది..

700 Oxygen Flow Meters Stolen In Warangal Mgm

700 oxygen flow meters stolen : ఓ పక్క కరోనాతో ప్రాణాలు పోతుంటో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో సిబ్బంది అరాచకాలు సాగిస్తున్నారు. హాస్పిటల్ లో రోగుల నుంచి భారీగా డబ్బులు గుంజేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో పోరాడుతుంటే దాన్ని అదనుగా భావించి సిబ్బంది అరాచకాలకు పాల్పడుతున్నారు. రోగులనుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. జలగల్లా రోగుల రక్తం పీల్చేస్తున్న అరాచకాలు జరుగుతున్నాయి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో.

హాస్పిటల్లోని ఆక్సిజన్ ఫ్లోమీటర్లను చోరీ చేస్తున్నారు సిబ్బంది. అలా 700ల ఆక్సిజన్ ఫ్లో మీటర్లను దొంగిలించి మరోచోట అమ్ముకుంటున్న వైనం బయటపడింది. ఎంజీఎం సిబ్బంది ఆక్సిజన్ ఫ్లో మీటర్లు దొంగిలించటమే కాకుండా ఆక్సిజన్ సిలిండర్లను మార్చుతు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆక్సిజన్ ఉన్న సిలిండర్లను తీసి వేసిన రోగులకు ఖాళీ సిలిండర్లను అమర్చుతున్నారు. అదేమని ప్రశ్నించి రోగులపైనా..వారి బంధువులపైనా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడ అంతే ఇష్టమైతే ఉండండీ లేకపోతే వెళ్లిపోండి అంటూ దురుసుగా సమాధానం చెబుతున్నారని రోగులు వాపోతున్నారు.

ఆక్సిజన్ ఫ్లో మీటర్లను హాస్పిటల్ సిబ్బంది అమ్ముతున్నారనే సమాచారంతో ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ పక్క ప్రైవేటు హాస్పత్రులకు ఏమాత్రం తీసిపోకుండా ఎంజీఎంలో అన్ని రకాల వైద్యం సదుపాయాలు అందేలా మంత్రి చర్యలు తీసుకుంటుంటే..మరోపక్క హాస్పిటల్ సిబ్బంది మాత్రం చేతివాటం చూపిస్తూ రోగులకు అందాల్సి వైద్య సదుపాయాలను దొంగిలించి బయట అమ్ముకుంటున్నారు.