Warangal Fake Currency Notes : ఏం తెలివి..! యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల ముద్రణ, వరంగల్‌లో దొంగ నోట్ల ముఠా అరెస్ట్

వరంగల్ లో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. విచారణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. యూట్యూబ్ లో చూసి నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Warangal Fake Currency Notes : ఏం తెలివి..! యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల ముద్రణ, వరంగల్‌లో దొంగ నోట్ల ముఠా అరెస్ట్

Warangal Fake Currency Notes : ఈజీ మనీ కొందరు కేటుగాళ్లు బరితెగిస్తున్నారు. అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించి వాటితోనే డబ్బు సంపాదిస్తున్నారు. తాజాగా వరంగల్ లో నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. విచారణలో పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. యూట్యూబ్ లో చూసి నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

జైల్లో పరిచయమైన వారితో కలిసి నకిలీ నోట్లు ప్రింట్ చేస్తున్న ముఠా సభ్యులను వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యులు నకిలీ కరెన్సీ నోట్లను రద్దీ ప్రాంతాల్లో చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.6లక్షల విలువైన నకిలీ రూ.2వేల నోట్లను, కలర్ ప్రింటర్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన సయ్యద్ యాకుబ్ అలియాస్ షకీల్, గడ్డం ప్రవీణ్, గుండా రజనీ కిడ్నాప్ కేసులో రామగుండం సబ్ జైల్లో శిక్ష అనుభవించారు. అదే సమయంలో వీరికి దొంగ నోట్లు ముద్రించే ముఠా సభ్యులతో పరిచయం ఏర్పడింది. వారి ద్వారా దొంగ నోట్లు ప్రింట్ చేసే తీరును తెలుసుకున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక ఈజీ మనీ కోసం అడ్డదారి తొక్కారు. నేర చరిత్ర కలిగిన నిందితులతో కలిసి నోట్ల తయారీకి శ్రీకారం చుట్టారు. యూట్యూబ్ ద్వారా ఒరిజినల్ 2వేల రూపాయలు పోలి ఉండే కాగితాల గురించి తెలుసుకున్న ఈ ముఠా వాటిని కొనుగోలు చేసి నకిలీ నోట్లను ముద్రించింది.

నకిలీ నోట్లను రద్దీగా ఉండే వ్యాపార ప్రాంతాలతో పాటు కిరాణ, బట్టల షాపు, మద్యం బెల్ట్ షాపుల దగ్గర చెలామణి చేసేవారు. గతేడాది కాలంగా నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ తో పాటు చుట్టు పక్కల జిల్లాల్లో నకిలీ నోట్లను చెలామణి చేశారు. వచ్చిన డబ్బుతో నిందితులు మద్యం సేవిస్తూ, జల్సాలు చేసేవారని పోలీసులు తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

శుక్రవారం ఉదయం ప్రధాన నిందితుడు మరో నిందితుడు అవినాష్ తో దొంగనోట్లను చెలామణి చేసేందుకు బైక్ పై సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుమల్ బార్ వద్దకు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో పథకం ప్రకారం నిందితులను పట్టుకున్నారు. వీరిని విచారించడంతో మిగతా వాళ్లు కూడా దొరికిపోయారు. నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు అయ్యింది.

హన్మకొండలో పెద్దమ్మగుడి దగ్గర అద్దె ఇంట్లో నిందితులు నకిలీ నోట్లను ముద్రించే వారు. నిందితులు మూడు బృందాలుగా విడిపోయి రద్దీ ప్రాంతాల్లో దొంగ నోట్లు చెలామణి చేసేవారు. యాకుబ్, అవినాష్ రూ.2వేల నోట్లు 50 తీసుకుని షకీల్ బైక్ పై పయనం అయ్యారు. అదే విధంగా రమేశ్, అతడి భార్య సునీత రూ.2వేల నోట్లు 40 తీసుకుని ప్రవీణ్ బైక్ పై బయలుదేరారు. హన్మకొండలోని తిరుమల బార్ గుండా హైదరాబాద్ కు బయలుదేరారు. కరెక్ట్ గా అదే సమయంలో పోలీసులు పట్టుకున్నారు.