Greater Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ లో వార్డ్ వ్యవస్థకు ఆటంకాలు.. జూన్ 2న ప్రారంభం కావాల్సిన వార్డ్ ఆఫీసులు, వార్డ్ కమిటీలు వాయిదా

కమ్యూనిటీ హాల్స్ లలో కార్యాలయాలను ఫిక్స్ చేసిన తర్వాత స్థానికులు అడ్డుకోవడంతో వాటిని అధికారులు మారుస్తున్నారు. తమ కార్యాలయం సైతం అధీనంలో ఉంచుకోవాలని జిహెచ్ఎంసి యోచిస్తోంది.

Greater Hyderabad : గ్రేటర్ హైదరాబాద్ లో వార్డ్ వ్యవస్థకు ఆటంకాలు.. జూన్ 2న ప్రారంభం కావాల్సిన వార్డ్ ఆఫీసులు, వార్డ్ కమిటీలు వాయిదా

GHMC (1)

Ward Offices And Committees : గ్రేటర్ హైదరాబాద్ లో వార్డ్ వ్యవస్థకు ఆటంకాలు తప్పడం లేదు. జూన్ 2న ప్రారంభం కావాల్సిన వార్డ్ ఆఫీసులు, వార్డ్ కమిటీలు వాయిదా పడ్డాయి. వార్డ్ ఆఫీసుల ఏర్పాటు, కమ్యూనిటీ హాల్స్ ను బల్దియా కు ఇచ్చేందుకు ప్రజల నుండి వ్యతిరేక వస్తోంది. 150 వార్డ్ ల్లో ఇప్పటికీ 50కి పైగా వార్డ్ కార్యాలయాల ఏర్పాటు జాప్యం జరిగింది.

కమ్యూనిటీ హాల్స్ లలో కార్యాలయాలను ఫిక్స్ చేసిన తర్వాత స్థానికులు అడ్డుకోవడంతో వాటిని అధికారులు మారుస్తున్నారు. తమ కార్యాలయం సైతం అధీనంలో ఉంచుకోవాలని జిహెచ్ఎంసి యోచిస్తోంది. దీంతో జూన్ 10న సుపరిపాలన దినోత్సవం రోజు వార్డ్ కార్యాలయాలు ప్రారంభించాలని యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు.

Railway Board: గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వేబోర్డు పచ్చ జెండా

జూన్ 10 నాటికి అయిన వార్డ్ ఆఫీసులు రెడీ చెయ్యాలని జోనల్ అధికారులకు కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. కేటీఆర్ ఆదేశించిన తర్వాత కూడా వార్డ్ కార్యాలయాలు రెడీ చెయ్యకపోవడంతో ఇటీవల కమిషనర్ కు స్పెషల్ సి.ఎస్ అరవింద్ కుమార్ మెమో ఇచ్చారు.